Skip to content

ఫ్యామిలీ అందరూ కలసి చూడదగ్గ సినిమా మిరాయ్: సూపర్ హీరో తేజ సజ్జా

సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ ‘మిరాయ్‌’లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, బిటిఎస్ వీడియో వైబ్ ఉంది సాంగ్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. మరింత ఎక్సయిట్మెంట్ ని పెంచుతూ మేకర్స్ అద్భుతమైన ట్రైలర్ ని లాంచ్ చేశారు.

నిస్వార్థంగా సాయం చేసే ఓ యువకుడి పరిచయంతో ట్రైలర్ ప్రారంభమౌతుంది. తొమ్మిది విలువైన గ్రంథాలను పొందడం, బ్లాక్ స్వోర్డ్ అనే విధ్వంసక శక్తి నుండి మానవాళిని రక్షించడం అతని విధి. ఒక మ్యాజికల్ స్టిక్ కనుగొన్న తర్వాత కూడా శక్తులు విఫలమైనప్పుడు, అతను దైవిక బలాన్ని పొందుతాడు. కార్తిక్ ఘట్టమణి ఈ కథను భారీ కాన్వాస్‌పై రూపొందించి, భారతీయ సినిమా అరుదుగా చూసిన స్థాయిలో ప్రజెంట్ చేశాడు. స్క్రీన్‌ప్లే, డైలాగ్, విజువల్స్ అద్భుతంగా వున్నాయి. శ్రీ రాముని ఫైనల్ ఫ్రేమ్స్ చూసినప్పుడు గూజ్ బంప్స్ వచ్చాయి.

తేజ సజ్జా యంగ్ స్టర్ నుంచి సూపర్ యోధ వరకు అతని క్యారెక్టర్ ట్రాన్స్ ఫర్మేషన్ అద్భుతంగా వుంది. అతని ఇంటెన్స్ ప్రిపరేషన్, ఫిజికల్ మేకోవర్, యాక్షన్ సీక్వెన్స్లలో చూపించి యీజ్.. ట్రూ ఎపిక్ అడ్వెంచర్ హీరోగా నిలిపాయి.

రాకింగ్ స్టార్ మనోజ్ మంచు ఫెరోషియస్ బ్లాక్ స్వోర్డ్‌గా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. రితికా నాయక్ తేజను మిరాయ్ వైపు నడిపించే కీలక పాత్ర పోషించింది. సాధువుగా జగపతి బాబు అద్భుతంగా నటించారు. తేజ తల్లిగా శ్రియ శరణ్ ఆకట్టుకుంది. జయరామ్ పాత్ర ఆసక్తికరంగా వుంది.

గౌరీ హరి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ లో వుంది ముఖ్యంగా రాముని దర్శన సమయంలో ఉన్న మంత్రోచ్ఛారణలు, అనుభూతిని ఆధ్యాత్మికంగా మార్చేస్తాయి. మిరాయ్ ప్రపంచాన్ని శ్రీ నాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా చూపింది. ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుజిత్ కుమార్ కొల్లి.

పీపుల్ మీడియా ఫాక్టరీ ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ విలువలతో పాథ్-బ్రేకింగ్ కాన్సెప్ట్‌ అందించింది. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. గ్రాండ్ VFX సీక్వెన్స్లతో కథనాన్ని మరొక స్థాయికి తీసుకెళ్తుంది. మైథాలజీ గ్రాండ్యూర్‌తో ట్రైలర్ మిరాయ్ పై భారీ అంచనాలు పెంచింది. ప్రేక్షకులు సెప్టెంబర్ 12 నుంచి “ది బ్రహ్మాండ్”ని ఎక్స్ పీరియన్స్ చేయబోతున్నారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సూపర్ హీరో తేజ సజ్జా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీ సపోర్ట్ వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. నేను మన తెలుగు ఆడియన్స్‌ కోసం నటిస్తున్నాను. మీ అందరి మెప్పు కోసం చేస్తున్నాను. నా సినిమా మిగతా భాషల వారికి నచ్చితే అది బోనస్‌ అంతే. నేను మాత్రం మీ కోసమే వర్క్ చేస్తున్నాను. మీ దగ్గరే ప్రెస్‌మీట్‌లు చేసుకుంటాను. మీ ముందే పుట్టాను, మీ ముందే పెరిగాను, ఇక్కడే ఉంటాను. మిరాయ్ రెండేళ్ల జర్నీ. హనుమాన్ రిలీజ్ కంటే ముందు ఈ సినిమాని కమిట్ అవ్వడం జరిగింది. హనుమాన్ తర్వాత చేయాలనుకున్న సరే ఇదే కథని ఇదే డైరెక్టర్ ఇదే ప్రొడక్షన్ లో చేసేవాడిని. ఇంతకంటే బెటర్ సినిమా నాకు దొరికేది కాదు. నేను ఈ సినిమా కోసం వంద శాతం ఎఫర్ట్ పెట్టాను. ఇలాంటి టీం ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను మా టీం 100% కష్టపడ్డాం. మీకు ట్రైలర్లో టీజర్ లో రేపు పొద్దున్న సినిమాలో కూడా కనిపిస్తుంది. కార్తీక్ గారు గొప్ప డివోపినే కాదు గొప్ప స్టోరీ టెల్లర్. ఆయనతో ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఫ్యూచర్లో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. హరి గారు ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో ఎలివేషన్స్ మూమెంట్స్ మామూలుగా ఉండవు. చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ వున్నాయి. విశ్వప్రసాద్ గారు చాలా పాషనేట్ ప్రొడ్యూసర్. ఆయన ఈ సినిమాకి చూపించిన కమిట్మెంట్ నేను మర్చిపోలేను. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. రితిక ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. శ్రీయ గారితో చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేశాను. ఈ సినిమా కథ నచ్చడం వల్లే ఆమె క్యారెక్టర్ చేశారు. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. నేను చిన్నప్పుడు నుంచి మనోజ్ గారి సినిమాలు చూస్తుంటే వాడిని. ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన పాత్ర ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. శశి గారు నా లక్కీ చార్మ్. ఈ సినిమాని కూడా చాలా గొప్పగా తీసుకెళ్తారని నమ్మకం ఉంది. చాలా గొప్ప కథ ఉన్న సినిమా ఇది. ఒక తల్లి కొడుకు ఎంత దూరం వెళ్ళాడనే ఎమోషనల్ కోర్ కూడా ఈ సినిమాలో ఉంది. సెప్టెంబర్ 12న చాలా క్లీన్ ఫిలిం తీసుకొస్తున్నాం. పిల్లలు ఫ్యామిలీ అందరు కలిసి చూసే సినిమా ఇది.

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.మిరాయ్ పై చాలా కలలు ఆశలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం ఈ ప్రయాణం ప్రారంభమైంది. ఈ అవకాశం ఇచ్చినందుకు టీమ్‌కు థాంక్స్‌ చెప్పాలి. చాలా పవర్ ఫుల్ రోల్. నా జీవితంలో ఇలాంటి పాత్ర ఇప్పటివరకూ చేయలేదు. ‘హనుమాన్‌’ లాంటి హిట్ అందుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేసి డబ్బులు సంపాదించాలని అందరూ అనుకుంటారు. అలా అనుకోవడంలో తప్పు లేదు. కానీ, తేజ ‘మిరాయ్’ కోసం మరొక ప్రాజెక్ట్‌ అంగీకరించకుండా మూడేళ్లు వేచి చూశాడు. అది మామూలు విషయం కాదు. తన జీవితంలో ఇంకెంత గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. నాకు సినిమా గురించి కొంచెం తెలుసు అనుకున్నాను. కానీ, కార్తిక్‌ ని కలిసిన తర్వాత నాకు ఏమీ తెలియదని అర్థమైంది. ఆయన ఆరేళ్ల క్రితం ఈ కథను రాసుకున్నాడు. అశోకుడు రాసిన 9 పుస్తకాల గురించి ప్రపంచానికి చెప్పాలనే సంకల్పంతో దీన్ని అద్భుతంగా రూపొందించారు. సినిమాని ఇంటర్నేషనల్ స్థాయిలో తీశారు. నిర్మాత విశ్వప్రసాద్‌ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. వాళ్ళ పాప కృతి ప్రసాద్ నాకు సిస్టర్ లాంటిది. నా చెల్లెలు ఈరోజు ఇంత పెద్ద ప్రొడక్షన్ కి ప్రొడ్యూసర్ అయిందంటే చాలా ఆనందంగా ఉంది. విశ్వప్రసాద్‌ గారు గొప్ప వ్యక్తి. తెలుగు సినిమా అంటే పాషన్ ని ఈ రంగంలోకి వచ్చారు. ‘రాజాసాబ్‌’ కోసం ఎంత చేస్తున్నారో.. మా ‘మిరాయ్‌’కు కూడా అంతే చేస్తున్నారు. ఆయనకు సినిమా చిన్నదా.. పెద్దదా అనే సంబంధం లేదు. ఇలాంటి నిర్మాతను ఇప్పటివరకూ చూడలేదు. విశ్వ ప్రసాద్ గారు లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. శ్రియ గారితో కలిసి నటించాలని ఎప్పటినుంచో అనుకున్నాను. ఈ చిత్రంతో అది తీరింది. ఇందులో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశాను. ఇంత పవర్ఫుల్ పాత్ర ఇచ్చినా డైరెక్టర్ కి థాంక్యూ. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేయాలనే ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి.

నిర్మాత కృతి ప్రసాద్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఇంత అద్భుతమైన సినిమాని థియేటర్స్ లో కీ తీసుకొస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 12న అందరూ థియేటర్స్ లో సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాత విశ్వ ప్రసాద్ గారికి హీరో తేజ గారికి మనోజ్ గారికి మా టీమ్ అందరికీ థాంక్యు. చాలా సిన్సియర్ గా తీసిన సినిమా ఇది. మీ అందరికీ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను.

శ్రియా మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఇంత అద్భుతమైన సినిమా తీసిన కార్తీక్ గారికి థాంక్యూ. చాలా మంచి రోల్ చేశాను. చాలా పవర్ ఫుల్ సినిమా ఇది. అందరూ కూడా ఈ సినిమాని సపోర్ట్ చేయాలి. థియేటర్స్ లో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.

నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమ గర్వపడేలా చేస్తుంది. సెప్టెంబర్ 12న థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.

హీరోయిన్ రితిక మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన అందరికీ థాంక్యూ. మేము చాలా కష్టపడి సినిమా చేశాము. ప్రతి ఒక్కరు సోల్ పెట్టి పని చేసాం. తప్పకుండా ఈ సినిమా మీకు థియేటర్స్ లో గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.

మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ట్రైలర్ సూపర్ గా ఉంది. తేజ జాంబిరెడ్డి సినిమాకి మేము రాయలసీమ డిస్ట్రిబ్యూట్ చేశాం. హనుమాన్ నైజం డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇప్పుడు మిరాయ్ నైజాం, చిత్తూరు జిల్లా కూడా చేస్తున్నాం. తప్పకుండా ఈ సినిమా చాలా అద్భుతమైన స్థాయిలో ఆడుతుందని నమ్మకం ఉంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ సూపర్ గా ఉంది. సెప్టెంబర్ 12న అందరూ సినిమాని థియేటర్స్ లో చూడండి. సినిమా అందర్నీ అలరిస్తుంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన విశ్వప్రసాద్ గారికి కృతి ప్రసాద్ గారికి ధన్యవాదాలు.

తారాగణం: సూపర్ హీరో తేజ సజ్జ, మనోజ్ మంచు, రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు
సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి
సంగీతం: గౌర హరి
ఆర్ట్ డైరెక్టర్: శ్రీ నాగేంద్ర తంగాల
రచయిత: మణిబాబు కరణం
పీఆర్వో: వంశీ-శేఖర్