మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం…
సైఫుద్దీన్ మాలిక్ దర్శకత్వం లో విడుదలకు సిద్ధంగా ఉన్న హార్రర్ త్రిల్లర్ చిత్రం ‘విచిత్ర ‘


రవి శ్రీయ తివారి హీరో హీరోయిన్ గా
సిస్ ఫిలిమ్స్ బ్యానర్ పై సైఫుద్దీన్ మాలిక్ నిర్మాణ దర్శకత్వం లో విడుదలకు సిద్ధంగాఉన్న చిత్రం ‘విచిత్ర’ పేక్షకుల హృదయాలను హత్తుకునే అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ “విచిత్ర” సెన్సర్ పనులు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
ఈ సందర్బంగా ఈ చిత్రం దర్శక నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ
ఈ సినిమాలోని హీరోగా రవి, హీరోయిన్ శ్రేయ తివారి, జ్యోతి అపూర్వ, ‘బేబీ’ శ్రీ హర్షిణి యసిక, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, మీనా వాసన్ ముఖ్య పాత్రలుగా నటించారు “విచిత్ర” ఒక ఆత్మీయమైన అమ్మ సెంటిమెంట్ నేపథ్యంతో రూపొందిన సినిమా. ప్రతి కుటుంబం తల్లి ప్రేమ, త్యాగం, బంధం గురించి ఆలోచించేలా చేసే హృదయాన్ని తాకే కథ ఇది. ఈ చిత్రాన్ని
కుటుంబంతో కలిసి సంతోషంగా ఎంజాయ్ చేస్తూ
చూసే ఫ్యామిలీ డ్రామాగా “విచిత్ర” నిలుస్తుందనే నమ్మకంతో మా టీమ్ పనిచేసింది. కథ విషయానికి వస్తే
అమ్మ ప్రేమను, భావోద్వేగాన్ని, కుటుంబ విలువలను కొత్త దృక్కోణంలో చూపించబోతున్నము.
ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని త్వరలోనే విచిత్ర మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం హృదయాల్లో చిరస్మరణీయమైన ముద్ర వేస్తుందనే ఆశాభావం ఉంది అని దర్శకనిర్మాత సైఫుద్దీన్ మాలిక్ తెలిపారు.
నటీనటులు జ్యోతి అపూర్వ, రవి, శ్రేయ తివారి, బేబీ యసిక రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, జబర్దస్త్ ఉద్ధండులు అప్పారావు, త్రినాథ్, సత్తిపండు, బాబీ తదితరులు అద్భుతంగా నటించారు. స్టోరీ సీస్ ఫిలిమ్స్, ఎడిటింగ్-కడిమిశెట్టి లక్ష్మీనారాయణ, సంగీతం- నిజాని
పి. ఆర్. ఓ. కడలి రాంబాబు, దయ్యల అశోక్
అంజన్, నిర్మాత దర్శకత్వం – సైఫుద్దీన్ మాలిక్.
సైఫుద్దీన్ మాలిక్
