మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం…
“తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ ఫస్ట్ సింగిల్ ‘చిన్ని చిన్ని గుండెలోన’ రిలీజ్

ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటుల, సాంకేతిక నిపుణులకు అండగా నిలబడుతూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. సుమైరా స్టూడియోస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘చిన్ని చిన్ని గుండెలోన’ రిలీజ్ చేశారు. ఆహ్లాదకరమైన పల్లె వాతావరణంలో చిత్రీకరించిన లవ్ సాంగ్ ఇది. ఈ పాటను క్యాచీ ట్యూన్ తో వంశీకాంత్ రేఖన కంపోజ్ చేశారు. సనరే లిరిక్స్ రాయగా, మంచి లవ్ ఫీల్ తో హరిణి ఇవటూరి, పవన్ కల్యాణ్ పాడారు. ‘చిన్ని చిన్ని గుండెలోన..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘చిన్ని చిన్ని గుండెలోన చాలా ప్రేమే దాచిన, దబాయించి దొంగోడా దోచుకుపోలేవా, చిందే చిందే ఈడులోన ఏకాంతాలే యాతన, మీసాలున్న మొనగాడా జంటకు రాలేవా, నువ్వే తాకి నా కురులే సిగ్గే పడే, అట్టా నన్ను చూశావంటే ఒంటిమీది చెమట చుక్క అత్తరల్లె గాలికి ఎగిరే..’ అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట.
నటీనటులు – సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు
టెక్నికల్ టీమ్
————-
ఆర్ట్ డైరెక్టర్ – సుధీర్ మాచర్ల
బిజినెస్ హెడ్ అండ్ మార్కెటింగ్ – చౌహాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్
డీవోపీ – అక్షయ్ రామ్ పొదిశెట్టి
మ్యూజిక్ – వంశీకాంత్ రేఖన
సీఈవో – రహస్య కిరణ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ – సుమైరా స్టూడియోస్
ప్రొడ్యూసర్ – కిరణ్ అబ్బవరం
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – వి. మునిరాజు
