Skip to content

కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్‌తో ఇట్లు అర్జున గ్లింప్స్ రిలీజ్.. భారీగా పెరిగిన అంచనాలు!

టాలీవుడ్‌లో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ హైప్ క్రియేట్ చేస్తోంది. నెట్టింట New guy in town అనే హ్యాష్‌ట్యాగ్‌తో టీజ్ చేసిన ఈ ఇట్లు అర్జున ప్రాజెక్ట్, ఒక్క గ్లింప్స్ తోనే సస్పెన్స్ నింపింది. ఈ గ్లింప్స్ వీడియో నెటిజనులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

ఇట్లు అర్జున గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయగా, ప్రస్తుతం అది ఎంతగానో ఆకట్టుకుంటుంది. కొత్త హీరో అనీష్‌ను లాంచ్ చేస్తూ మహేశ్ ఉప్పల మొదటిసారి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు.. ఛలో, భీష్మ లాంటి సూపర్ హిట్స్ అందించిన వెంకీ కుడుముల ఈసారి నిర్మాతగా మారి What Next Entertainments బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో మలయాళ సూపర్ హిట్ భామ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకి ఎస్.థమన్ సంగీతం అందిస్తుండగా, రాజ మహదేవన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నాడు. న్యూ ఏజ్ లవ్ స్టోరీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో కొత్త నటులతో పాటు పలువురు పాపులర్ యాక్టర్లు కూడా కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్‌ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇందులో కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రేమ ఎంత దూరమైనా పరుగెత్తిస్తుందని, కానీ మాటల్లో చెప్పలేనంత లోతైనదనే డైలాగ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ వాయిస్ ఓవర్ సినిమా యొక్క థీమ్ గురించి అందంగా హింట్ ఇస్తుంది. అలాగే గ్లింప్స్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోజ్ చేసిన సాంగ్, BGM ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రాజా మహదేవన్ సినిమాటోగ్రఫీ అయితే అదిరిపోయింది. విజువల్స్ చాలా బాగున్నాయి. ఈ గ్లింప్స్ చూడగానే చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో హీరో అనీష్ చెవిటి మూగవాడి పాత్రలో నటిస్తున్నాడు. గ్లింప్స్ లో వికలాంగుడిగా అతను చేసిన స్టంట్స్ చూస్తుంటే ఈ సినిమా ఏదో ఒక కొత్త ప్రయోగంలా అనిపిస్తుంది. సోల్ ఆఫ్ అర్జున అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ గ్లింప్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మొత్తానికి ఈ క్రేజీ కాంబినేషన్‌తో ఈ సినిమా కచ్చితంగా బిగ్ హిట్ అవుతుందనే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.