Skip to content

మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా నేషనల్‌ మేథమాటిక్స్‌ డే

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో సోమవారం శ్రీనివాస రామానుజన్‌ జయంతిని పురస్కరించుకుని నేషనల్‌ మేథమాటిక్స్‌ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్‌ చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. విద్యార్థులు రామానుజన్‌ వేషధారణల్లో హాజరై, తమదైన స్పీచ్‌లతో ఆకట్టుకున్నారు. అదేవిధంగా మేథమాటిక్స్‌ క్విజ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, ఆర్‌ఐ, ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి చేతులమీదుగా ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులతో పాటు మెడల్స్, సర్టిఫికెట్స్‌ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీన్‌ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్‌ పల్లవి, కోఆర్డినేటర్స్‌ అఖిల్, జనార్ధన్, ఇన్‌చార్జులు బాలరాజు, ఆంజనేయులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.