హీరో - రాకేష్ జాగర్లమూడి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అతి పిన్న వయసులోనే దేశం కోసం…
ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా డి.సురేష్ బాబు

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. ఇక వైస్ ప్రసిడెంట్‌గా సూర్యదేవర నాగవంశీ ఎన్నిక కాగా.. ఫిల్మ్ చాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. అయితే నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సురేష్ బాబు ఏడాది పాటు పదవిలో కొనసాగనున్నారు. లుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్స్ పోటీ పడ్డాయి. మన ప్యానెల్‌ను చిన్ని నిర్మాతలైన సి.కల్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్ బలపరచగా. ప్రోగ్రెసివ్ ప్యానెల్‌ను సురేష్‌బాబు, అల్లు అరవింద్, దిల్‌రాజు లాంటి అగ్ర నిర్మాతలు బలపరిచారు. ఇక ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తన బలాన్ని నిరూపించుకుంది. మొత్తం నాలుగు సెక్టార్లకు సంబంధించిన మొత్తం 48 మంది ఎన్నికయ్యారు. వీరిలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 31 మంది విజయం సాధించగా, మన ప్యానెల్ నుంచి 17 మంది గెలుపొందారు.
