రవిబాబు ‘రేజర్’ మే 8న రిలీజ్
తెలుగు సినిమాలో యూనిక్ ఫిల్మ్ మేకర్ గా, నటుడిగా ముద్రవేసిన రవిబాబు తన గత చిత్రాల కన్నా భిన్నమైన ఇంటెన్స్ వైలెంట్ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ 'రేజర్' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు సమర్పిస్తుండగా, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం, రవిబాబు తండ్రి దివంగత చలపతిరావు జయంతి సందర్భంగా, మే 8, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ‘ఎనుగుతోండం ఘటికాచలం’ వంటి లైట్ టోన్ చిత్రంతో అలరించిన రవిబాబు, ఇప్పుడు ‘రేజర్’తో టెన్షన్, సైకాలజికల్ వైలెంట్ యాక్షన్ తో కూడిన డార్క్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. దర్శకుడిగానే కాకుండా ప్రధాన పాత్రలోనూ నటిస్తూ, ఈ సినిమాకు తనదైన రా టచ్ ఇచ్చారు. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే మంచి…
