Skip to content

“జిందగీ ఇన్ టు షేడ్స్”కి ఈ స్థాయి స్పందన ఊహించలేదు!!

“జిందగీ ఇన్ టు షేడ్స్”కి ఈ స్థాయి స్పందన ఊహించలేదు!! Telugu News
“జిందగీ ఇన్ టు షేడ్స్”కి ఈ స్థాయి స్పందన ఊహించలేదు!! Telugu News

-ఫిల్మ్ మేకర్ డాలీ తోమర్

ఓంషీల్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన డాక్యుమెంటరీ “జిందగీ ఇన్ టూ షేడ్స్”తో డాలీ తోమర్ హృదయాన్ని తాకే కథనాన్ని తెరపైకి తీసుకొచ్చారు. డాలీకి సినిమామేకింగ్ అంటే కేవలం వృత్తి కాదు… సర్వస్వం. భావోద్వేగాలు, మానవ సంబంధాల ప్రయాణమే ఆమె సినిమా.

ఈ డాక్యుమెంటరీ మొదటి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయిన ఇఫ్తేకర్ షరీఫ్ జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. రెండు దేశాలు, రెండు సంస్కృతుల మధ్య తన జీవితాన్ని ఎలా అర్థవంతంగా సాగిస్తున్నాడో ఈ చిత్రం చూపిస్తుంది. ఈ ప్రయాణం మొదలైన నగరం కావడంతో హైదరాబాద్‌ను ప్రీమియర్ వేదికగా ఎంచుకున్నారు డాలీ. ఇది ఆయన పుట్టిన గడ్డ, భావోద్వేగాల కేంద్రం, అలాగే ఆయన విజయంతో ముడిపడి ఉన్న నగరం.
చికాగోలో ఇఫ్తేఖార్, ఎన్నో ఏళ్లుగా పత్రాలు లేకుండా విదేశాల్లో జీవిస్తున్న భారతీయులకు సహాయం చేస్తూ, వారిని సురక్షితంగా స్వదేశానికి చేర్చిన దృశ్యాలను డాలీ ప్రత్యక్షంగా చూసారు. ఆ మానవీయత ఆమె హృదయాన్ని తాకి, ఈ డాక్యుమెంటరీ రూపొందించేలా చేసింది.

దర్శకుడు రజనీష్ దూబే సున్నితంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి, దేవు నామ్‌దేవ్ అందించిన ఎడిటింగ్ భావోద్వేగ గాఢతను పెంచింది. డాలీ తోమర్ స్వయంగా రూపకల్పన చేసిన నేపథ్య సంగీతం చిత్రానికి ఆత్మను అందించింది. నిర్మాతలు ఖుర్రం సయీద్ మరియు కల్పనా రాజ్‌పుత్ మద్దతుతో రూపొందిన ఈ డాక్యుమెంటరీకి, అంతర్జాతీయ సినిమా వేదికల నుంచి, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. భావాలు సరిహద్దులు దాటుతాయని మరోసారి ఈ చిత్రం నిరూపిస్తోంది!!

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.