Skip to content

సీతా పయనం నుంచి ‘పయనమే’ సాగే మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల

సీతా పయనం నుంచి ‘పయనమే’ సాగే మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల Telugu News

శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతోన్నారు.

ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటి వరకు వదిలిన కంటెంట్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ క్రమంలో ‘పయనమే’ పాటను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాటను కాసర్ల శ్యాం రచించారు. అనూప్ రూబెన్స్ అందించిన బాణీ ఎంతో క్యాచీగా ఉంది. ఈ మెలోడియస్, రొమాంటిక్ పాటను అనూప్ రూబెన్స్, సత్య ప్రకాష్ కలిసి ఆలపించారు. ఇక ఈ పాటలో అర్జున్, అనూప్ రూబెన్స్ కనిపించి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీని కూడా ఈ లిరికల్ వీడియోలో చక్కగా చూపించారు.

ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తుండటంతో ప్రమోషనల్ కార్యక్రమాల్ని కూడా వినూత్నంగా చేపట్టారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి జి బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. చిత్రంలోని స్టంట్ సన్నివేశాలకు కిక్ యాస్ కాళీ కొరియోగ్రఫీ అందించారు.

నటీనటులు : నిరంజన్, ఐశ్వర్య అర్జున్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ, యాక్షన్ కింగ్ అర్జున్, యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా తదితరులు

సాంకేతిక బృందం:

బ్యానర్: శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్
స్టోరీ – స్క్రీన్ ప్లే – ప్రొడ్యూసర్, డైరెక్టర్: యాక్షన్ కింగ్ అర్జున్
డైలాగ్స్: Dr. సాయి మాధవ్ బుర్ర
మ్యూజిక్: మెలోడీ కింగ్ అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: G. బాల మురుగన్
ఎడిటర్: అయూబ్ ఖాన్
ఆర్ట్ డైరెక్టర్స్: మోహన్ బి కేరీ, శివ కామేష్ డి, CH కృష్ణ
ఫైట్స్ : కిక్ యాస్ కాళీ
కో-డైరెక్టర్: UL. మూర్తి
PRO: సాయి సతీష్
డిజిటల్ మార్కెటింగ్: స్టార్ సర్కిల్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.