హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో మదర్ సెంటిమెంట్‌ను ప్రధానంగా తీసుకుని రూపొందిన తాజా తెలుగు చిత్రం…
సూపర్బ్ రెస్పాన్స్ దక్కించుకుంటున్న “ధూల్ పేట్ పోలీస్ స్టేషన్” వెబ్ సిరీస్

సరికొత్త కంటెంట్ తో ఆడియెన్స్ ను థ్రిల్ చేస్తున్న ఆహా ఓటీటీ అందించిన మరో ఎగ్జైటింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్’. 50 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ 100 మిలియన్ మినిట్స్ ఫ్లస్ వ్యూస్ తో సూపర్బ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్’ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ వెబ్ సిరీస్‌కు జెస్విని దర్శకత్వం వహించారు. అశ్విన్, శ్రీతు, పదిని కుమార్, గురు, ప్రీతి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ సిరీస్ కు అశ్వతన్ మ్యూజిక్ అందించారు. ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రాత్రి మూడు హత్యలు జరిగితే ఆ కేసును ఇద్దరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ ఎలా సాల్వ్ చేశారనేది ఈ సిరీస్ లో ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు. నగరంలో ఒకే రాత్రి జరిగిన 3 హత్యల కేస్ సాల్వ్ చేసేందుకు రంగంలోకి దిగిన ఏసీపీ అశ్విన్ నేరస్తులను పట్టుకున్నాడా లేదా ఈ కేసుల విచారణ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ‘ధూల్ పేట్ పోలీస్ స్టేషన్’ సిరీస్ లో థ్రిల్లింగ్ గా తెరకెక్కించారు.
