తెలుగు సినిమాలో యూనిక్ ఫిల్మ్ మేకర్ గా, నటుడిగా ముద్రవేసిన రవిబాబు ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ 'రేజర్'…
లిపి ఎపిక్స్ ఆప్ లో రామాయణం ఈరోజు ప్రముఖుల సమక్షంలో దస్పల్లా హోటల్లో జరిగింది

ఈ సభకు శ్రీ మా శర్మ గారు అధ్యక్షత వహించారు. లిపి ఎపిక్స్ ఆప్ లో మహాభారత, రామాయణాలు కథలు, వీడియోలు, ఆడియోల రూపంలో యువతకు తెలియజేసే ఆలోచనతో సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వాడి తయారు చేశాము అని కంపెనీ సీఈవో శ్రీ విద్యాసాగర్ అనిసింగరాజుగారు తెలియజేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారు మాట్లాడుతూ మహాభారత రామాయణాలు మంచి నడవడిక, వ్యక్తిత్వ వికాసం కోసం అందరూ కచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పారు. ఎల్ వి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ పిల్లల మేధాశక్తి మీద భాష ఎలా ప్రభావితం చేస్తుందో తెలియచేసి లిపి ఎపిక్స్ ఆప్ ఆటల ద్వారా పిల్లలకు భాష మీద, మన సంస్కృతి మీద పట్టు సాధించేలా చేయొచ్చు అని చెప్పారు. శ్రీమతి రమా రావి గారు జ్ఞాపక శక్తి కోసం, స్ట్రెస్ రిలీఫ్ కోసం ఆమె స్వయంగా ప్రతిరోజు లిపి ఆప్ వాడుతున్నానని అందరూ లిపి యాప్ ని ఉపయోగించుకోవాలని చెప్పారు. జయప్రకాశ్ నారాయణ గారు (విశ్రాంత ఐఏఎస్ ) మాట్లాడుతూ భాష మీద పట్టు ఉంటే మేధస్సు మీద పట్టు ఉంటుందని తెలుగు మీద మమకారాన్ని పెంచుకుంటే మిగిలిన భాషలు బాగా మాట్లాడగలమని మహాభారత రామాయణాలు మన దేశ సంస్కృతి అని వాటిని కచ్చితంగా నేర్చుకోవటానికి లిపి ఎపిక్స్ ఆప్ అందరూ వాడాలి అని, లిపి ఎపిక్స్ సంస్థని అందరూ ప్రోత్సహించాలని తెలియజేశారు. ప్రముఖ హాస్యనటులు పద్మశ్రీ బ్రహ్మానందం గారు మాట్లాడుతూ సులభంగా తెలియచేస్తే మన ఇతిహాసాలు అందరికీ అర్థం అవుతాయని లిపి ఎపిక్స్ ని అభినందిస్తూ కచ్చితంగా అందరూ లిపి ఎపిక్స్ యాప్ ని వాడాలి అని ప్రోత్సహించారు
