Skip to content

‘యూఫోరియా’ మూవీపై మహేష్ బాబు ప్రశంసలు – దర్శకుడు గుణశేఖర్

‘యూఫోరియా’ మూవీపై మహేష్ బాబు ప్రశంసలు  – దర్శకుడు గుణశేఖర్ Telugu News

విభిన్నమైన కథలతో ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే దర్శకుడు గుణ శేఖర్ గత వారం (ఫిబ్రవరి 6) ‘యుఫోరియా’ అంటూ బాక్సాఫీస్ సందడి చేశారు. గుణ హ్యాండ్‌మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమా గుణ, యుక్త గుణ నిర్మించిన ఈ చిత్రాన్ని రాగిణి గుణ సమర్పించారు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గ కథ, కథాంశంతో గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఇటీవలె తెలంగాణ గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ చిత్రాన్ని వీక్షించి సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. గుణశేఖర్ మేకింగ్‌‌ను ఆయన కొనియాడారు. ప్రజలందరూ తప్పక చూడాల్సిన సినిమా అని మెచ్చుకున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని ‘యుఫోరియా’ సినిమాని వీక్షించారు.

చిత్రాన్ని వీక్షించిన అనంతరం మహేష్ బాబు సోషల్ మీడియాలో ఈ విధంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘గుణశేఖర్ గారు తన కథలను ఎలా ప్రెజెంట్ చేస్తారనే విషయంలో ఎప్పుడూ ఓ ప్రత్యేక శైలి ఉంటుంది.. ఈ మూవీని నేను ఎంతో ఎంజాయ్ చేశాను.. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌ను మలిచిన తీరు నాకెంతో నచ్చింది.. ఈ మూవీని అందరూ తప్పక చూడండి. గుణశేఖర్ గారూ, భూమిక, టీం మొత్తానికి అభినందనలు. గుణ శేఖర్ గారి మేకింగ్, ఆయన టెక్నికల్ టీం మ్యాజిక్ చేసింది’ అని పోస్ట్ చేశారు.

ఈ చిత్రంలో భూమికా చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్పలత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ ఫిల్మ్ మేకర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ పోలీస్ కమీషనర్ జయదేవ్ నాయర్ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించారు.

గౌతమ్ మీనన్ పాత్రతో పోక్సో చట్టాన్ని ఎలా ప్రయోగిస్తారు.. కేసు దర్యాప్తులో సమయంలో ఎలా సాక్ష్యాల్ని సేకరిస్తారు? అనే విషయాల్ని ఎంతో వాస్తవికంగా చిత్రీకరించారు. నీలిమా గుణశేఖర్ నిర్మించిన ఈ చిత్రానికి కాళ భైరవ సంగీతం అందించారు. ఈ చిత్రం సాంకేతికంగా కూడా ప్రత్యేకంగా నిలిచింది. మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే హానికరమైన పరిణామాలను హైలైట్ చేయడంతో పాటు, బాధ్యతాయుతమైన తల్లిదండ్రుల ప్రాముఖ్యతను కూడా ఈ చిత్రం నొక్కి చెప్పింది.

నటీనటులు: భూమికా చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్పలత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి తదితరులు

సాంకేతిక సిబ్బంది
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గుణశేఖర్
సమర్పణ: రాగిణి గుణ
నిర్మాతలు: నీలిమ గుణ, యుక్త గుణ
సంగీతం: కాళ భైరవ
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె పోతన్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
డైలాగ్స్: నాగేంద్ర కాశి, కృష్ణ హరి
పీఆర్వో : వంశీ కాకా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.