నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్ లుక్ రిలీజ్

విరాట్ కర్ణ హీగా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘నాగబంధం’. ఈ చిత్రం పాన్-ఇండియాలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో టీం ప్రమోషన్లను ముమ్మరం చేసింది. ఫస్ట్-లుక్ పోస్టర్లు ఇప్పటికే సంచలనాన్ని సృష్టించాయి. ఈ చిత్ర టీజర్‌ను రేపు మహా శివరాత్రి శుభ సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేయనున్నారు. టీజర్ మీడియా ప్రీమియర్ ఇప్పటికే జరిగింది. విజువల్స్, స్టొరీ టెల్లింగ్, వరల్డ్ బిల్డింగ్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ రోజు మేకర్స్, KGF ఫేమ్ గరుడ రామ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తూ ఆయన పాత్ర బైరాగిని పరిచయం చేశారు. బూడిదతో అలంకరించిన శరీరం, జటలతో కూడిన ఆతన లుక్ మిస్టికల్ టచ్ ఇచ్చింది. ఇంటెన్స్ లుక్స్, రుద్రాక్షలు, ఎముకలతో చేసిన మాలలు ఆయనను శక్తివంతమైన తాంత్రిక యోధుడిగా చూపిస్తున్నాయి.
గరుడ రామ్ చేతిలో కపాలాలు, ఎముకలు, పాములతో అలంకరించిన భారీ దండ కనిపిస్తూ, చీకటి, నిషిద్ధ శక్తులను సూచిస్తోంది. అడవి, పాములు, చెల్లాచెదురుగా ఉన్న కపాలాలు మరింత క్యురియాసిటీ పెంచుతున్నాయి.
కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ‘నాగబంధం’లో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తుండగా, జగపతి బాబు, జయప్రకాష్, మురళి శర్మ, బి.ఎస్. అవినాష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సౌందర్ రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీ, ఆర్సి ప్రణవ్ ఎడిటింగ్, అశోక్ కుమార్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ విజువల్ వండర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధంగా ఉంది.
నటీనటులు: విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, జయప్రకాష్, మురళి శర్మ, బి.ఎస్. అవినాష్
సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాతలు: కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి
సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్
సంగీతం: అభే, జునైద్ కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: అశోక్ కుమార్
ఎడిటర్: ఆర్సి ప్రణవ్
సీఈఓ: వాసు పోతిని
పీఆర్ఓ: వంశీ-శేఖర్
