The Allu Arjun Fans Association (AAFA) continues to strengthen its commitment toward…
ఘనంగా విజయ దేవరకొండ– రష్మిక మందన్నా పెళ్లి


హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికా మందన్నా గురువారం పెళ్లిపీటలు ఎక్కారు. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. గురువారం ఉదయం 10గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు విజయ్. తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఇద్దరూ. వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వివాహానికి ఇరు కుటుం» సభ్యులతో పాటు అతికొద్ది మంది ముఖ్యమైన సన్నిహితులు హాజరయ్యారు. 2025 అక్టోబరులో నిశ్చితార్థం చేసుకున్న విజయ్–రష్మికలు గురువారం ఏడడుగులు వేసి, వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో వీరి పెళ్లి రిసెప్షన్‌ని ఏర్పాటు చేశారు. ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాల్లో నటించిన విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా ప్రస్తుతం ‘రణబాలి’ అనే చిత్రంలో నటిస్తున్నారు.
