Skip to content

ZEE5లో మార్చి 6 నుంచి ‘గాంధీ టాక్స్’ వరల్డ్ డిజిటల్ స్ట్రీమింగ్

థియేటర్లలో అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత ‘గాంధీ టాక్స్’ ఇప్పుడు మార్చి 6 నుండి ZEE5లో ప్రపంచ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళంలో అందుబాటులోకి రానుంది. మూవీమిల్, క్యోరియస్‌తో కలిసి జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కిషోర్ పాండురంగ్ బెలేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాంధీ టాక్స్’లో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరి, సిద్ధార్థ్ జాదవ్ వంటి అద్భుతమైన తారాగణం నటించింది. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి మరింత ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే.
‘గాంధీ టాక్స్’ అనేది వ్యక్తిగత నష్టం, ఆర్థిక ఒడిదుడుకులు, నైతిక సందిగ్ధతలను ఎదుర్కొన్న కొందరి వ్యక్తుల ప్రయాణం. వారి మార్గాలు, ప్రయాణాలు ఎలా కలిశాయి.. ఆ తరువాత కలిగిన పర్యవసానాలు ఏంటి? అనే ఆసక్తికరమైన అంశాలతో కథ సాగుతుంది. ఎలాంటి డైలాగ్స్ లేకపోయినా నటీనటుల పర్ఫామెన్స్, విజువల్స్, మ్యూజిక్‌తోనే కథను నడిపించిన తీరు అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులకు లోతుగా లీనమయ్యే, కనెక్ట్ చేసేలా ఓ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌‌ను ‘గాంధీ టాక్స్’ ఇస్తుంది. డిజిటల్ స్ట్రీమింగ్ సందర్భంగా
విజయ్ సేతుపతి మాట్లాడుతూ .. ‘‘గాంధీ టాక్స్’ నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎన్నో విషయాల్ని ఈ మూవీ కమ్యూనికేట్ చేస్తుంది. మన పర్ఫామెన్స్, ప్రజెన్స్‌తో పూర్తిగా భావోద్వేగాలను వ్యక్తపరచడం ఒక ప్రత్యేకమైన అనుభవం. థియేటర్‌లో మాకు అద్భుతమైన స్పందన రావడం ఆనందంగా ఉంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఇప్పుడు ZEE5 ద్వారా అందరి ఇళ్లలోకి రాబోతోంది. ప్రేక్షకులు మా ‘గాంధీ టాక్స్’తో, అందులోని సందేశంతో కనెక్ట్ అవుతారని, ఓ మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొందుతారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
అదితి రావు హైదరి మాట్లాడుతూ .. ‘‘గాంధీ టాక్స్’ నన్ను ఎంతో ఆకర్షించింది. అందులోని నిశ్చలత, దృశ్యమానంతో కథ చెప్పడం గొప్ప విషయం. సినిమాలోని ప్రతి క్షణం, ప్రతీ పాత్రతో ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు. మా మూవీకి థియేటర్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం జీ5 ఈ చిత్రాన్ని అన్ని భాషలలో విస్తృత ప్రేక్షకులకు తీసుకువస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది మీ స్వంత మార్గంలో గమనించడానికి, ప్రతిబింబించడానికి, అర్థం చేసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానించే కథ’ అని అన్నారు.
దర్శకుడు కిషోర్ పాండురంగ్ బెలేకర్ మాట్లాడుతూ .. ‘‘గాంధీ టాక్స్’ నాకు చాలా వ్యక్తిగతమైన, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. మాటలు లేకుండా కథ చెప్పడం సాధారణ విషయం కాదు. పూర్తిగా విజువల్స్, ప్రదర్శనలు, సంగీతంపై ఆధారపడటం అనేది మమ్మల్ని సవాలు చేసింది. థియేటర్లలో ఈ చిత్రానికి లభించిన ప్రేమ, ప్రశంసలు చాలా ప్రోత్సాహకరంగా అనిపించాయి. ZEE5 ఈ చిత్రానికి ప్రతిచోటా ప్రేక్షకులను చేరుకోవడానికి ఒక వేదికను ఇస్తున్నందుకు నేను కృతజ్ఞుడను. దీని ద్వారా మరింత ఎక్కువ మంది ప్రేక్షకులు ‘గాంధీ టాక్స్’ భావోద్వేగ ప్రయాణాన్ని, ప్రత్యేకమైన కథను అనుభవించడానికి వీలు కల్పిస్తుంది’ అని అన్నారు.

ZEE5లో మార్చి 6 నుండి ‘గాంధీ టాక్స్‌’ తమిళం, తెలుగు, మలయాళం ప్రసారం కానుంది.
ZEE5 గురించి…
జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, లింక్డిన్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో జీ5ని అనుసరించండి.