Skip to content

నవ్విస్తూ, భయపెడుతూ అంచనాలు పెంచేసిన ‘రాకాస’ టీజర్

నవ్విస్తూ, భయపెడుతూ అంచనాలు పెంచేసిన ‘రాకాస’ టీజర్ Telugu News
నవ్విస్తూ, భయపెడుతూ అంచనాలు పెంచేసిన ‘రాకాస’ టీజర్ Telugu News
నవ్విస్తూ, భయపెడుతూ అంచనాలు పెంచేసిన ‘రాకాస’ టీజర్ Telugu News

ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుని సాధించారు. ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకున్న నిహారిక ప్రస్తుతం మరో డిఫరెంట్ స్టోరీతో ఓ సినిమాని ఆడియెన్స్ ముందుకు తీసుకు రానున్నారు. జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో.. నిహారిక త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌గా ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు.
ఈ క్రమంలో రిలీజ్ చేసిన కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్ తరువాత సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు మేకర్స్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘నరకం నుండి సందేశం వస్తుంది.. ఇక సమయం లేదు.. మన ఊరి శాపమిది.. మన పూర్వీకులు ఎంచుకున్న తలరాత’ అంటూ ఊరిని, ఊరి జనాల్ని పరిచయం చేస్తూ వదిలిన టీజర్ అద్భుతంగా ఉంది. ‘శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం.. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం.. ఈ రెండు లైన్సే వస్తున్నాయేంటి?’ అంటూ భయపడుతూ, నవ్విస్తూ హీరో పాత్రని పరిచయం చేశారు.
హీరో పాత్ర ఎంట్రీ ఇచ్చిన తరువాత టీజర్ పూర్తిగా కామెడీ జానర్‌లోకి మారిపోయింది. ఇదే ఆఖరి హెచ్చరిక అంటూ మళ్లీ మరో కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లినట్టుగా అనిపిస్తుంది. ఆ తరువాత చూపించిన యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, ఆర్ఆర్ అన్నీ కూడా నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయి. ఇక చివర్లో హీరో భయపడుతూ.. ‘స్త్రీ.. రేపు రా’ అనే డైలాగ్ అదిరిపోయింది. టీజర్ చూస్తుంటే కంప్లీట్ పవర్ ఫ్యాక్డ్ సినిమాలా కనిపిస్తోంది. నవ్వించడం, భయపెట్టడంతో పాటు ఏదో ఓ కొత్త కాన్సెప్ట్‌ను ‘రాకాస’లో పరిచయం చేయబోతోన్నట్టుగానే కనిపిస్తోంది.

టీజర్‌తో ఒక్కసారిగా అంచనాల్ని అమాంతం పెంచేసినట్టు అయింది. ఇక ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీత దర్శకుడిగా, రాజు ఎదురోలు సినిమాటోగ్ర‌ఫర్‌గా పని చేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.
న‌టీన‌టులు: సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌, వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుక్వింద‌ర్ సింగ్‌, అన్న‌పూర్ణ‌, అమ‌న్‌, అనూప్ సింగ్ ఠాకూర్‌, ర‌మ‌ణ భార్గ‌వ్‌, వాసు ఇంటూరి, రోహిణి (బ‌జ‌ర్ద‌స్త్‌), రోహ‌న్ (నైంటీస్‌) త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం: బ్యాన‌ర్స్: జీ స్టూడియోస్‌, పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్‌ l నిర్మాత‌లు: నిహారిక కొణిదెల‌, ఉమేష్‌కుమార్ బన్సాల్‌ l క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, ద‌ర్శ‌క‌త్వం: మాన‌స శ‌ర్మ‌ l ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: మ‌న్యం ర‌మేష్‌ l ఆడిష‌న్ స్క్రీన్ ప్లే: మ‌హేష్ ఉప్పాల‌ l సంగీతం: అనుదీప్ దేవ్‌ l సినిమాటోగ్రాఫ‌ర్‌: రాజు ఎదురోలు l యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌: విజ‌య్‌ l ఎడిట‌ర్‌: అన్వ‌ర్ అలీ l ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రామాంజ‌నేయులు l ఆర్ట్ డైరెక్ట‌ర్‌: పుల్ల విష్ణు వ‌ర్ధ‌న్‌ l కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: సంధ్య సబ్బ‌వ‌ర‌పు l పి.ఆర్.ఒ: ఎస్‌.కె.నాయుడు-ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా) l ఈవెంట్ పార్ట్‌న‌ర్‌: యు వి మీడియా l మార్కెటింగ్‌: టికెట్ ఫ్యాక్ట‌రీ

See also  తెలుగులో తొలి ఏఐ సినిమా “అంబ’s రివెంజ్”

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.