Skip to content
‘రాకాస’ నుంచి ఆకట్టుకునే ‘రపప్పా.. రపప్పా’ అంటూ సాగే పాట విడుదల Telugu News

‘రాకాస’ నుంచి ఆకట్టుకునే ‘రపప్పా.. రపప్పా’ అంటూ సాగే పాట విడుదల

‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకున్నారు. అలాంటి ఓ అద్భుతమైన సినిమా తరువాత జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో నిహారిక త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌గా ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో రిలీజ్ చేసిన ‘రాకాస’ గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇంత వరకు చేసిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాయి. ఇక ఈ టీం మ్యూజికల్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేసింది. ‘రపప్పా.. రపప్పా’ అంటూ సాగే ఈ పాట…

Read more
‘గద్దర్ అవార్డు 2025’లో సత్తా చాటిన ‘దండోరా’ Telugu News

‘గద్దర్ అవార్డు 2025’లో సత్తా చాటిన ‘దండోరా’

తెలంగాణ ప్రభుత్వం ఏటా ఇస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డుల్ని తాజాగా ప్రకటించింది. 2025 సంవత్సరానికి గానూ తెలంగాణ ప్రభుత్వం అత్యుత్తమ చిత్రాల్ని, ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చిన నటీనటులకు, సాంకేతిక నిపుణలకు అవార్డుల్ని ప్రకటించింది. ఈ క్రమంలో శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘దండోరా’కి అవార్డు వచ్చింది. సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా ‘దండోరా’ చిత్రాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. వైవిధ్యమైన చిత్రాలను నిర్మించి లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని మంచి పేరు సంపాదిచుకున్న సంగతి తెలిసిందే. ఆయన నిర్మాణంలో రూపొందించిన ‘దండోరా’ చిత్రానికి తాజాగా గద్దర్ అవార్డులు వచ్చాయి. ఈ చిత్రంలో శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు…

Read more
‘గద్దర్ అవార్డు 2025’లో రెండు అవార్డులను సాధించిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ Telugu News

‘గద్దర్ అవార్డు 2025’లో రెండు అవార్డులను సాధించిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’

తెలంగాణ ప్రభుత్వం 2025 ఏడాదికి గానూ ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాకి రెండు కేటగిరీల్లో అవార్డులు లభించాయి. చిన్న చిత్రంగా థియేటర్లోకి వచ్చి ఆడియెన్స్‌ను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీకి గద్దర్ అవార్డులు కూడా రావడంతో తగిన గుర్తింపు లభించినట్టు అయింది. తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన ఈ చిత్రంలో మాస్టర్ రోహన్ రాయ్ ఓ కీలక పాత్రను పోషించాడు. సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. థియేటర్లో మంచి సక్సెస్ సాధించిన ఈ మూవీకి తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన గద్దర్…

Read more
‘‘రాకాస’ థియేటర్‌కు వచ్చిన వాళ్లని నిరాశపర్చం.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల Telugu News

‘‘రాకాస’ థియేటర్‌కు వచ్చిన వాళ్లని నిరాశపర్చం.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల

ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకున్నారు. అలాంటి ఓ అద్భుతమైన సినిమా తరువాత జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో నిహారిక త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌గా ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో.. నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘పింక్ ఎలిఫెంట్ నుంచి వచ్చే ప్రతీ కంటెంట్‌ను ఆడియెన్స్ ప్రేమిస్తూ, సపోర్ట్ చేస్తూనే…

Read more
నవ్విస్తూ, భయపెడుతూ అంచనాలు పెంచేసిన ‘రాకాస’ టీజర్ Telugu News

నవ్విస్తూ, భయపెడుతూ అంచనాలు పెంచేసిన ‘రాకాస’ టీజర్

ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుని సాధించారు. ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకున్న నిహారిక ప్రస్తుతం మరో డిఫరెంట్ స్టోరీతో ఓ సినిమాని ఆడియెన్స్ ముందుకు తీసుకు రానున్నారు. జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో.. నిహారిక త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌గా ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో రిలీజ్ చేసిన కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్ తరువాత సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. ఇక…

Read more
ZEE5లో మార్చి 6 నుంచి ‘గాంధీ టాక్స్’ వరల్డ్ డిజిటల్ స్ట్రీమింగ్ Telugu News

ZEE5లో మార్చి 6 నుంచి ‘గాంధీ టాక్స్’ వరల్డ్ డిజిటల్ స్ట్రీమింగ్

థియేటర్లలో అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత ‘గాంధీ టాక్స్’ ఇప్పుడు మార్చి 6 నుండి ZEE5లో ప్రపంచ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళంలో అందుబాటులోకి రానుంది. మూవీమిల్, క్యోరియస్‌తో కలిసి జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కిషోర్ పాండురంగ్ బెలేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాంధీ టాక్స్’లో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరి, సిద్ధార్థ్ జాదవ్ వంటి అద్భుతమైన తారాగణం నటించింది. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి మరింత ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ‘గాంధీ టాక్స్’ అనేది వ్యక్తిగత నష్టం, ఆర్థిక ఒడిదుడుకులు, నైతిక సందిగ్ధతలను ఎదుర్కొన్న కొందరి వ్యక్తుల…

Read more
మార్చి 1న   ‘రాకాస’ టీజర్  విడుదల Telugu News

మార్చి 1న ‘రాకాస’ టీజర్ విడుదల

ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా తన మార్క్‌ను క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో.. నిహారిక త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌గా ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. https://www.instagram.com/p/DVOGg_ikV_T ‘రాకాస’ నుంచి ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్, ప్రమోషన్స్ చేస్తున్న తీరు ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని పెంచిన సంగతి తెలిసిందే. ‘రాకాస’ గ్లింప్స్‌కి అయితే నెక్ట్స్ లెవెల్లో రెస్పాన్స్ వచ్చింది…

Read more