Skip to content

‘ధురంధర్ ది రివెంజ్’ ట్రైలర్ మార్చి 7 ఉదయం 11:01 గంటలకు రిలీజ్

కొన్ని వారాలుగా కొనసాగుతున్న అభిమానుల ఉత్సాహం మధ్య రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న భారీ చిత్రం ధురంధర్ ది రివెంజ్ అఫీషియల్ పోస్టర్‌ను జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ విడుదల చేశాయి.

ఈ పోస్టర్‌లో ట్రైలర్ మార్చి 7 ఉదయం 11:01 గంటలకు విడుదల కానుందని ప్రకటించారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ట్రైలర్ కోసం ఇప్పటికే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.

ఈ చిత్రంలో రణవీర్ సింగ్ జస్కిరత్ సింగ్ రంగీ, హమ్జా రెండు విభిన్న అవతారాల్లో కనిపించనున్నారు. ఈ కథలో ఈసారి సంఘర్షణ మరింత వ్యక్తిగతంగా మారబోతుందని పోస్టర్ సూచిస్తోంది.

ధురంధర్ పార్ట్ 1 భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. ముఖ్యంగా నార్త్ అమెరికా, కెనడా, యుకే, ఆస్ట్రేలియా వంటి మార్కెట్లలో భారీ విజయాన్ని అందుకుంది. “ధురంధర్: ది రివెంజ్” మరోసారి అంచనాలను మించి రికార్డ్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

జియో స్టూడియోస్ సమర్పణలో, బి62 స్టూడియోస్ నిర్మాణంలో, దర్శకుడు ఆదిత్య ధార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఒక హై-ఆక్టేన్ స్పై–యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రానికి జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

హిందీ, తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. గుడి పాడ్వా, ఉగాది పండుగల సందర్భంలో ఈద్‌కు ముందుగా విడుదలవుతూ భారీ ఓపెనింగ్ సాధించేందుకు సిద్ధమవుతోంది.