నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ 'ది ప్యారడైజ్' ఫస్ట్ సింగిల్ ఆయా షేర్…
‘వదలా’ సినిమా అద్భుతంగా వచ్చింది: హీరో జగపతి బాబు


జగపతి బాబు, లయ, ఆకెళ్ళ వి కృష్ణ, కిషోర్ నాయుడు చిరుమామిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ్, చరిత చిత్ర ప్రొడక్షన్ ‘వదలా’ గ్రిప్పింగ్ గ్లింప్స్ లాంచ్
వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు, బలమైన కుటుంబ భావోద్వేగాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’తో రాబోతున్నారు. ఈ చిత్రంలో లయ కథానాయికగా నటించగా, హృతిక శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. అకెళ్ళ వి కృష్ణ దర్శకలో కిషోర్ నాయుడు చిరుమామిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ్ చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈరోజు మేకర్స్ గ్రిప్పింగ్ గ్లింప్స్ లాంచ్ చేశారు.
గ్లింప్స్ ప్రారంభంలో జగపతిబాబు కలవరపరిచే ఆలోచనల్లో మునిగిపోయినట్లు కనిపించారు. ఆ తర్వాత లయ ఎంట్రీ ఇస్తుంది. ఆమె ముఖంలో కనిపించే ఆందోళన, టెన్షన్ కథలోని పరిస్థితులను సూచిస్తుంది.
కథ ఒక్కసారిగా మరింత డార్క్ టోన్‌లోకి మారుతుంది. ఒక మహిళా వాయిస్ ఓవర్ వినిపిస్తూ ”నీ ఫ్యామిలీలో ఒకరిని తీసేసుకుంటా’ అని చెప్పడం షాకింగ్ అల్టిమేటమ్‌ను రివిల్ చేస్తుంది. ఇది వెంటనే ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తుంది.
షార్ఫ్ కట్స్‌తో యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ మూమెంట్స్ “రేస్ అగైనెస్ట్ టైమ్” అనిపించే టెన్షన్ ని సృష్టిస్తాయి. దర్శకుడు ఆకెళ్ళ వి కృష్ణ సస్పెన్స్‌ను హ్యాండిల్ చేసిన తీరు ప్రత్యేకంగా నిలుస్తుంది.
జగపతి బాబు కొన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న పాత్రలో కనిపించారు. మరోవైపు లయ కూడా ఇంటెన్స్ వున్న పాత్రలో కనిపిస్తూ కథకు బలాన్ని ఇస్తుంది.
సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు అందించిన డైనమిక్ విజువల్స్ సినిమాకు ప్రత్యేక టోన్ సెట్ చేతోంది. సంగీత దర్శకుడు కార్తిక్ అందించిన పల్సేటింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వదలా థీమ్ థ్రిల్‌ను మరింత పెంచుతుంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు చేసిన క్రిస్ప్ ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా వుంది.
చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల రచన అందించగా, ఆర్ట్ డైరెక్షన్‌ను బజ్జా బ్రహ్మయ్య నిర్వహించారు. మొత్తంగా ఈ ఇంట్రిగింగ్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతూ, టెన్షన్, భావోద్వేగం, థ్రిల్ కలిసిన హై-ఇంపాక్ట్ థ్రిల్లర్‌ను ప్రామిస్ చేస్తోంది.
గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో హీరో జగపతిబాబు మాట్లాడుతూ… అందరికీ నమస్కారం.. వదలా సినిమాని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లడం మీడియా బాధ్యత. తీసుకెళ్లకపోతే మిమ్మల్ని వదలా.. ఆడియన్స్ రాకపోతే వాళ్లని వదలా.. బాగుంది అనేవరకు వదలా ఇది ఆడియన్స్ కి మీకు మాకు.. మన ముగ్గురికి సంబంధించిన మేనియా( నవ్వుతూ) కిషోర్ గారు భరద్వాజ గారి మీద అభిమానంతో ఒక సినిమా చేద్దామని ఆయన ఫీల్ అవ్వడంతో ఈ సినిమా మొదలైంది. భరద్వాజ గారు ముక్కుసూటిగా ఉంటారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం చోటా కె నాయుడు. తన ఎనర్జీ అందరికీ పంచాడు. ఒక చిన్న ప్రాబ్లం వచ్చి ఈ సినిమా చేయమని నేనే రిక్వెస్ట్ చేశాను. మరో ఆలోచన లేకుండా సినిమా చేశారు. అందరూ ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఈ సినిమా భోపాల్ లో చేశాం. అక్కడి ప్రభుత్వానికి ధన్యవాదాలు. భరద్వాజ గారు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పటికీ 24 గంటలు పనిచేస్తున్నారు.ఆయన్ని అభినందించాలి. ఆయన ఆలోచనలు చాలా మోడరన్ గా ఉన్నాయి. అలాంటి ప్రొడ్యూసర్స్ ఉండడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా పనిచేస్తున్న అందరూ నటీనటులు టెక్నీషియన్స్ చాలా సపోర్ట్ చేశారు. కార్తిక్ సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. తన నుంచే వదలా అనే టైటిల్ కూడా వచ్చింది. లయ నా డియర్ ఫ్రెండ్. మనోహరం సినిమా చేసినప్పుడు తను చాలా చిన్న పిల్ల. తర్వాత హనుమాన్ జంక్షన్ చేశాం. వదలాలో కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ఉంది.ఆముద పాత్రలో హ్రితిక కూడా చాలా టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ఆడియన్స్ అందరు కూడా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. సునీల్ నారంగ్ గారు వున్నారు కాబట్టి చాలా మంచి రిలీజ్ ఉంటుంది. కచ్చితంగా మంచి హిట్ కొట్టగలమనే నమ్మకం ఉంది. అందరికీ థాంక్యు.
హీరోయిన్ లయ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. డైరెక్టర్ వంశీ గారు కథ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి కథ నేనెప్పుడూ కూడా వినలేదు. చివరి వరకు ఏమవుతుందో అనేది ఎవరు ఊహించలేరు. జగపతిబాబు గారితో మనోహరం సినిమా చేశాను ఆ సినిమా ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. తర్వాత నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. చోట గారు నన్ను అద్భుతంగా చూపించారు ఆయన చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. హృతికా శ్రీనివాస్ ఆముద పాత్రలో చాలా చక్కగా చేసింది. ఈ సినిమా అవకాశం ఇచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి అలాగే కిషోర్ గారికి ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.
డిఓపి చోటా కె నాయుడు మాట్లాడుతూ.. భరద్వాజ్ గారిని దాసరి నారాయణ గారితో సమానంగా ఒక గురువుగారిగా చూస్తాను. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. జగపతిబాబు గారు నా ఫస్ట్ హీరో. ఆ రోజు నుంచి ఈరోజు వరకు మా రిలేషన్ వదలా అన్నట్టుగానే ఉంది. లయ అద్భుతమైన పెర్ఫార్మర్. ఈ సినిమాలో తన కొన్ని సీన్లు చేస్తున్నప్పుడు జయసుధ గారు గుర్తొచ్చారు హృతికా శ్రీనివాస్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. కార్తీక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాకి అందరూ కూడా 24 గంటలు పాటు పనిచేశారు. డైరెక్టర్ మంచి స్క్రిప్ట్ తో వచ్చారు. అందరికీ ఆల్ ద బెస్ట్.
హృతికా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది చాలా డిఫరెంట్ స్టోరీ ఇది. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలో ఇలాంటి కథ రాలేదు. ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. జగపతిబాబు గారు భరద్వాజ్ గారు ఇలా అద్భుతమైన వ్యక్తులతో కలిసి పని చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ప్రేక్షకులు ఊహించిన దాని కంటే ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది,
మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ.. అంత అద్భుతమైన నటీనటులు టెక్నీషియన్స్ తో పనిచేసే అవకాశం ఇచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి ధన్యవాదాలు. జగపతిబాబు గారికి నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్. ఆయన సినిమాకి నేను మ్యూజిక్ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో చాలా పాటలు వైవిధ్యంగా ఉంటాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు.
నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సినిమా తీసి దాదాపుగా పది సంవత్సరాలు అవుతోంది. సినిమా అంటే భయపడుతున్న సమయంలో కిషోర్ గారు వచ్చే సినిమా చేద్దామన్నారు. జగపతి బాబు గారికి కథచాలా నచ్చింది కథ పై నమ్మకంతో మొదలుపెట్టాం. అప్పటికి ఇప్పటికీ సినిమా పరిశ్రమలో తేడా ఏంటి అని నన్ను చాలామంది అడుగుతుంటారు. అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు. ఈ సినిమా అని చేస్తనంతకాలం పని తప్పితే ధ్యాస లేదు. ఈ రోజుల్లో కూడా 24 గంటలు పాటు పనిచేస్తున్నారని ఈ సినిమా చేశాక తెలిసింది. అందరు కూడా చాలా సిన్సియర్ గా పనిచేశారు. దానికి ఫలితం ఈరోజు మీరు చూసిన గ్లింప్స్. జగపతిబాబు గారు ఈ సినిమాకి ఒక నిర్మాత కంటే ఎక్కువగా పని చేశారు బాబు గారు లేకుండా ఈ సినిమాని అసలు ఊహించలేము. చోటా కె నాయుడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీళ్ళిద్దరికీ థాంక్యూ వెరీ మచ్. సునీల్ నారంగ్ గారికి థాంక్ యూ. నేను పరిశ్రమలకు వచ్చి 50 ఏళ్ళు అవుతోంది. అప్పుడు నుంచి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు. చాలా కాలం తర్వాత ఈ సినిమా చేస్తున్నాను కాబట్టి మీడియా ప్రేక్షకులు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
నిర్మాత కిషోర్ నాయుడు మాట్లాడుతూ..నేను నిర్మాతగా మీ ముందు నిలబడ్డాను అంటే దానికి కారణం తమ్మారెడ్డి భరద్వాజ గారు. జగపతిబాబు గారు, చోటా కే నాయుడు గారు భరద్వాజ గారు నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అవన్నీ నాకు జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ సినిమా తీసిన తర్వాత సినిమా అంటే గౌరవం పెరిగింది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు.
తారాగణం: జగపతి బాబు, లయ, హృతికా శ్రీనివాస్, అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, జెన్నీ, రేణు, కశ్యప్ రాజ్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: ఆకెళ్ల వి కృష్ణ
రచయిత: లక్ష్మీ భూపాల
నిర్మాతలు: కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ
DOP: చోటా కె నాయుడు
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: కార్తీక్ కొడకండ్ల
ఆర్ట్ డైరెక్టర్: బజ్జా బ్రమయ్య
స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్
సాహిత్యం: కృష్ణవేణి మల్లవజ్జల, శివకృష్ణాచారి ఎర్రోజు, వీరు గడ్డం
ప్రొడక్షన్ కంట్రోలర్: బొడ్డు సత్యనారాయణ
పబ్లిసిటీ డిజైన్: కృష్ణా డిజిటల్
పీఆర్వో: వంశీ-శేఖర్
