▪️ 53వ బ్రాంచీ లాంచ్ చేసిన ‘కలర్స్ హెల్త్‌కేర్’ ▪️ అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుక ▪️…
‘ఆయా షేర్’ కోసం భారీ స్లమ్ సెట్స్ నిర్మాణం

‘ది ప్యారడైజ్’ చిత్రంలోని “ఆయా షేర్” పాట ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. పలు భాషల్లో మిలియన్ల వ్యూస్ సాధించడంతో పాటు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వైరల్ గా రీక్రియేట్ అవుతోంది. ఈ పాటలో చూపించిన ప్రపంచాన్ని తీర్చిదిద్దేందుకు మేకర్స్ ఒక భారీ స్లమ్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇందులో హీరోను స్లమ్‌ల సామ్రాట్‌లా చూపించేలా ప్రత్యేకంగా సెట్స్ రూపొందించారు.
టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్బుతమైన స్పందనతో పాటు సోషల్ మీడియాలో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. ది ప్యారడైజ్ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది
ఇటీవల విడుదలైన “ఆయా షేర్” పాట రా ఎనర్జీ, స్ట్రైకింగ్ విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాటకు వచ్చిన గ్రాండ్ లుక్ వెనుక ప్రధాన కారణం ఆర్ట్ డిపార్ట్‌మెంట్ రూపొందించిన అద్భుతమైన సెట్స్. గ్రాండియర్‌తో పాటు సహజత్వాన్ని కలిపి ఈ సెట్స్ రూపొందించారు.
అత్యంత ఆకట్టుకునే సెటప్‌లలో ఒకటి హీరో హౌస్ (కమాన్ సెట్). హీరో పవర్‌ఫుల్ డిప్ మోమెంట్ కోసం ప్రత్యేకంగా ఈ భారీ నిర్మాణాన్ని రూపొందించారు. ఈ నిర్మాణం వెడల్పు 60 అడుగులు, ఎత్తు 45 అడుగులు, లోతు 25 అడుగులతో నిర్మించబడింది. మొదట ఈ సెట్‌ను 30 అడుగుల వెడల్పుతో నిర్మించగా, తర్వాత ఇరువైపులా 15 అడుగుల చొప్పున విస్తరించి మొత్తం వెడల్పును 60 అడుగులకు పెంచారు. దాదాపు 25 మంది కార్మికులు సుమారు 20 రోజుల పాటు శ్రమించి ఈ భారీ నిర్మాణాన్ని పూర్తి చేశారు. సెట్ చుట్టుపక్కల వాతావరణంలో సహజంగా కలిసిపోయేలా ప్రత్యేక ఏజింగ్ టెక్నిక్స్ ఉపయోగించి దాన్ని మరింత సహజంగా కనిపించేలా తీర్చిదిద్దారు.
వాటర్ బాడీ విలేజ్ సెట్ మరో హైలెట్. ఇది 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడింది. ఇందులో డమ్మీ నిర్మాణాలు కాకుండా పూర్తిగా నిర్మించిన 60 ఇళ్లు ఉన్నాయి. దాదాపు 50 మంది కార్మికులు 30 రోజుల పాటు శ్రమించి ఈ గ్రామాన్ని నిర్మించారు. ఒకేసారి సుమారు 500 మంది ఉండేలా ఈ గ్రామాన్ని డిజైన్ చేశారు. వాటర్ బాడీ కోసం 100 ట్యాంకర్ల నీటిని తీసుకువచ్చి ఏడు రోజుల పాటు నింపారు. అదనంగా నీటిని నిల్వ ఉంచేందుకు 20 అడుగులు × 20 అడుగుల పరిమాణంతో, 20 అడుగుల లోతు ఉన్న ఒక చెరువును కూడా నిర్మించారు.
నిర్మాణంలో భాగంగా మరో భారీ డంప్ యార్డ్ సెట్ కూడా నిర్మించారు. ఇది 120 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తుతో రూపొందించబడింది. దాదాపు 25 మంది సభ్యులతో కూడిన బృందం 30 రోజుల పాటు శ్రమించి ఈ సెట్‌ను నిర్మించింది. నిజమైన డంప్ యార్డ్ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సహజమైన, నివసిస్తున్నట్లు అనిపించే లుక్ వచ్చేలా దీనిని డిజైన్ చేశారు.
ఈ సెట్స్‌ను మరింత ప్రత్యేకంగా నిలిపింది ఏమిటంటే, ప్రకృతిని ఎక్కడా దెబ్బతీయకుండా నిర్మించారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ చాలా జాగ్రత్తగా ఈ నిర్మాణాలను సహజ భూభాగంలో కలిసిపోయేలా తీర్చిదిద్దింది. రియలిజం , సహజత్వం పెరగడానికి సహజ టెక్స్చర్లు, ఏజింగ్ టెక్నిక్స్ విస్తృతంగా ఉపయోగించారు.
ప్రతి సెటప్‌ను అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేసి రూపొందించారు. అవసరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాతే ఈ నిర్మాణాలను పూర్తి చేశారు.
ఈ అద్భుత నిర్మాణలతో ప్రేక్షకులకు “ఆయా షేర్” పాటలో చూసిన విజువల్ వరల్డ్ మెస్మరైజ్ చేసింది .“ది ప్యారడైజ్” వరల్డ్ బిగ్ స్క్రీన్ పై ఎంత గొప్ప అనుభూతిని అందించబోతోందో ‘ఆయా షేర్’ సాంగ్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది.


