టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ…
#SVC63 లో హీరోయిన్ గా నయనతార

#SVC63 చుట్టూ హైప్ రోజురోజుకీ పెరుగుతోంది, ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మరింత బిగ్ స్కేల్ కి చేరుకుంది. నిన్నటి భారీ అనౌన్స్‌మెంట్‌తో ఇప్పటికే భారతీయ సినీ ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ వంశీ పైడిపల్లి, ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు కలసి హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా చేయబోతున్నారు.
ఈ అంచనాలను మరింత పెంచుతూ, లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా అధికారికంగా చేరినట్లు మేకర్స్ ప్రకటించారు. బాలీవుడ్‌లో తన బ్లాక్‌బస్టర్ ఎంట్రీగా నిలిచిన జవాన్ తర్వాత, నయనతార ఈ ప్రాజెక్ట్‌లో చేరడం సినిమాకు మరింత బజ్ తీసుకువచ్చింది.
దర్శకుడు వంశీ పైడిపల్లి తన సినిమాల్లో హీరోయిన్ పాత్రలను బలంగా చూపించడంలో ప్రసిద్ధి. ఈ కథలో కూడా హీరోయిన్ పాత్ర కీలకంగా ఉండటంతో, నయనతారలాంటి పవర్ ఫుల్ నటిని ఎంపిక చేయడం ప్రత్యేకంగా నిలుస్తోంది. సల్మాన్ ఖాన్ – నయనతార జంట ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, స్టార్ పవర్, స్కేల్, స్ట్రాంగ్ స్టోరీటెల్లింగ్.. ప్యాకేజ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతి అప్డేట్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, 2027లో థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. #SVC63 2027లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలుస్తోంది.
మరిన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి.
తారాగణం: సల్మాన్ ఖాన్, నయనతార
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వంశీ పైడిపల్లి
నిర్మాత: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
PRO: వంశీ-శేఖర్
