#SVC63 మూవీ మొదటి షెడ్యూల్ ముంబైలో ప్రారంభం
సల్మాన్ ఖాన్–వంశీ పైడిపల్లి–దిల్ రాజు కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ షూటింగ్ దశలోకి అడుగుపెట్టింది. ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవగా, కథానాయికగా నయనతార అధికారికంగా సెట్స్‌లో చేరారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్ట్ కొలాబరేషన్ కావడం విశేషం. ఈ కాంబినేషన్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించగా, షూటింగ్ ప్రారంభంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది. #SVC63 ప్రాజెక్టు ఈరోజు సంప్రదాయ ముహూర్తం కార్యక్రమంతో ప్రారంభమై, నెల రోజులపాటు సాగనున్న భారీ షెడ్యూల్ మొదలైంది. ముంబైలో ప్రత్యేకంగా నిర్మించిన హ్యూజ్ సెట్లో హై-ఇంటెన్స్…
