చార్మింగ్ స్టార్ శర్వా లేటెస్ట్ బంపర్ బ్లాక్ బస్టర్ బైకర్. మాళవిక నాయర్ హీరోయిన్ గా…
‘వీర ప్రతాప్ అనిపించుకుంటా ‘ – హీరో తిరువీర్

టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ హీరోగా, ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాపం ప్రతాప్’. కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వరుస బ్లాక్ బస్టర్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్న ఈటీవి విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న ఈ సినిమా నుంచి రీసెంట్‌గా రిలీజైన టీజర్‌కు మంచి అప్లాజ్ వస్తోంది. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో పిల్ల ఎక్కడుంది సాంగ్ ని రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కేఎం రాధకృష్ణ అద్భుతమైన మాస్ నెంబర్ గా కంపోజ్ చేసిన ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ్ ఆకట్టుకునే సాహిత్యం అందించారు. రామ్ మిర్యాల వోకల్స్ సాంగ్ ఎనర్జీని మరింత పెంచాయి. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రత్యేకంగా పరామర్శ సభ ప్రెస్ మీట్ ని నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో హీరో తిరువీర్ మాట్లాడుతూ: పరామర్శ సభకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. గత సంవత్సరం మా బుజ్జమ్మ నన్ను వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇరుగుపొరుగు వారు, ఊర్లో వాళ్లు ఎన్నో విధాలుగా నన్ను విమర్శించారు. అందరూ “పాపం ప్రతాప్” అని మాత్రమే అన్నారు… కానీ నా సమస్యకు పరిష్కారం చెప్పిన వాళ్లు ఎవరూ లేరు. ఈ నెల 17వ తేదీన నా “బుజ్జమ్మ”తో మీ ముందుకు, మీ ఊర్లో థియేటర్లలో వస్తాను. నా సమస్య ఏమిటి? దానికి పరిష్కారం ఏమిటి? అన్నది మీకు చూపిస్తాను. ఇప్పటివరకు “పాపం ప్రతాప్” అన్నవాళ్లతో “వీర ప్రతాప్” అనిపించుకుంటాను. ఏప్రిల్ 17న మీరు “వీర ప్రతాప్”ని చూస్తారు.


