‘పాపం ప్రతాప్’ ని వీర ప్రతాప్ చేసిన ఆడియన్స్ కి ధన్యవాదాలు : తిరువీర్
టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పాపం ప్రతాప్’. ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వరుస బ్లాక్‌బస్టర్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్న ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌తో థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్యూ మీట్ నిర్వహించారు. థాంక్యూ మీట్‌లో హీరో తిరువీర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమాకు చాలా బాగా ప్రమోషన్స్ జరిగాయి. సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ ముందు ఎక్కడ ‘పాపం ప్రతాప్’ అవుతానేమో అనే భయం…
