Skip to content

‘ది రెడ్ బ్యాగ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ చిత్రాల్ని జనాలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ప్రస్తుతం థియేటర్, ఓటీటీల్లో ఎక్కువగా కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలే విజయాన్ని సాధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే కథతో ‘ది రెడ్ బ్యాగ్’ అనే సినిమాని హరికృష్ణ సోమిశెట్టి నిర్మించారు. ఈ మూవీకి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను టీం పూర్తి చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
కబీర్ దుహన్ సింగ్ , ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను హీరో దినేష్ తేజ్, రైటర్, డైరెక్టర్ హరి ప్రసాద్ రిలీజ్ చేసి చిత్రయూనిట్‌‌కు బెస్ట్ విషెస్ అందించారు.
ఈ మూవీకి శేఖర్ మోపురి సంగీతమందించగా,విక్రమ్ రాజా రచన సహకారం అందించారు. ప్రియేష్ గురుసామి కెమెరామెన్‌గా, శివ శర్వాని,శశి ఎడిటర్‌గా పని చేశారు.
*నటీనటులు* : కబీర్ దుహన్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి తదితరులు
*సాంకేతిక బృందం*
నిర్మాత : హరికృష్ణ సోమిశెట్టి
కథ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్శకత్వం :రవికుమార్ శీరపు
సంగీతం : శేఖర్ మోపురి
కెమెరా : ప్రియేష్ గురుసామి
రచన :విక్రమ్ రాజా
ఎడిటింగ్ :శివ శర్వాని,శశి
అడిషనల్ డైలాగ్స్ :మహమ్మద్ సాయి
లైన్ ప్రొడ్యూసర్ : నితిన్ కుమార్ ఆర్
ఫైట్స్ :జాషువా, డ్రాగన్ ప్రకాష్
లిరిక్స్ :కాసర్ల శ్యాం, తిరుపతి
డాన్స్ మాస్టర్స్ : జేడీ, స్నేహ భజంత్రి
పీఆర్వో : సాయి సతీష్