Skip to content

‘మైసా’ నుంచి రష్మిక బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

నేషనల్ క్రష్ రష్మిక లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఫీమేల్ -సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మైసా. దర్శకుడు రవీంద్ర పుల్లే దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆకట్టుకున్న టైటిల్‌, ఫస్ట్ లుక్ పోస్టర్‌లు, టీజర్ తో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రష్మిక పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.

ఈ పోస్టర్‌లో రష్మిక గాయాలతో నిండిన, యుద్ధం చేసినట్లుగా కనిపించే లుక్‌లో కనిపిస్తోంది. ఆమె ముఖం మీద మట్టి, పొగ, రక్తపు మరకలు కనిపిస్తుండగా, ముక్కు, చెంపలు, నుదుటిపై ఉన్న గాయాలు ఆమె పాత్ర ఎదుర్కొన్న క్రూరత్వాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. అయినప్పటికీ, ఆమె కళ్లలో కనిపించే ఆగ్రహం, తీవ్రత మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆ పాత్రకు అవసరమైన రా ఫెరోసిటీని అద్భుతంగా ప్రతిబింబిస్తోంది.
గొండ్ తెగల సాంస్కృతిక నేపథ్యంతో తెరకెక్కుతున్న “మైసా” సినిమాలో రష్మికను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా, ఓ శక్తివంతమైన గొండ్ మహిళగా కనిపించనున్నారు. ఎమోషన్స్, హై-ఆక్టేన్ యాక్షన్ మేళవింపుతో, ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కుతోంది.
ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
సినిమాటోగ్రఫీని శ్రేయాస్ పి కృష్ణ అందిస్తుండగా, జేక్స్ బీజోయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ యాక్షన్ సీక్వెన్సులను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
తారాగణం: రష్మిక మందన్న, ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: రవీ