నాగశౌర్య, రామ్ దేశినా, శ్రీనివాస రావు చింతలపూడి, శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ వారి 'బ్యాడ్ బాయ్…
‘పళ్లిచట్టంబి’ ట్రైలర్ రిలీజ్


మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ “పళ్లిచట్టంబి”. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. “పళ్లి చట్టంబి” సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీ ఈ నెల 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
ఈ రోజు “పళ్లిచట్టంబి” సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – కున్నుంపురంలో పేదల భూములపై కొందరు స్వార్థపరులు కన్నేస్తారు. ఎదురు తిరిగిన ప్రజలను హింసించేందుకు అవినీతిపరుడైన ఓ పోలీస్ ఆఫీసర్ ను ఉపయోగించుకుంటారు. ఈ భూమిని, తమను కాపాడే ఓ వ్యక్తి కోసం అక్కడి ప్రజలంతా వేచి చూస్తుంటారు. ఆ సమయంలో వీరుడు లాంటి వ్యక్తి కున్నుంపురంలో అడుగుపెడతాడు. అక్కడి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాడు. ఆ ఊరి మట్టినే ఆయుధంగా మలచి, పెను తుఫాన్ లాంటి దాడులను ఎదుర్కొంటాడు. ప్రజలతో కలిసి ఎంతో ధైర్య సాహసాలతో ఈ వ్యక్తి చేసిన పోరాటం ఫలించిందా ?, ఆ భూమి ఊరి ప్రజలకే దక్కిందా ? లేదా ? అనేది ట్రైలర్ ఆసక్తిని కలిగించింది. ఈ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఉన్నట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. టొవినో థామస్ పర్ ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సులు చేసిన విధానం, కయదు లోహర్ మేకోవర్, స్క్రీన్ ప్రెజెన్స్ ట్రైలర్ కు హైలైట్స్ గా నిలుస్తున్నాయి. 50, 60 దశకాల నేపథ్య కథను దర్శకుడు డిజో జోస్ ఆంటోనీ ఎంతో సహజంగా తెరకెక్కించారు.
నటీనటులు – టొవినో థామస్, కయదు లోహర్, విజయరాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెక్జాండర్, తదితరులు
టెక్నికల్ టీమ్
————–
కాస్ట్యూమ్స్ – మంజూష రాధకృష్ణన్
మేకప్ – రషీద్ అహ్మద్
ప్రొడక్షన్ డిజైన్ – దిలీప్ నాథ్
ఎడిటింగ్ – శ్రీజిత్ సరంగ్
సినిమాటోగ్రఫీ – టిజో టోమీ
మ్యూజిక్ – జేక్స్ బిజోయ్
స్క్రిప్ట్ – ఎస్ సురేష్ బాబు
అసోసియేట్ ప్రొడ్యూసర్స్ – మేఘశ్యామ్, తంజీర్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్
డైరెక్టర్ – డిజో జోస్ ఆంటోనీ
https://youtu.be/lX7qKKrQPzE
