నాగశౌర్య, రామ్ దేశినా, శ్రీనివాస రావు చింతలపూడి, శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ వారి 'బ్యాడ్ బాయ్…
‘రాకాస’ వరల్డ్‌వైడ్‌గా 3 రోజుల్లో ₹15.80 కోట్ల కలెక్షన్స్

ఈ సమ్మర్‌లో ప్రేక్షకులను మెప్పించి థియేటర్స్‌కు రప్పిస్తోన్న సినిమాగా ‘రాకాస’ సెన్సేషన్ క్రియేట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సమ్మర్‌లో ఎంటైర్ ఫ్యామిలీ థియేటర్స్‌కు వచ్చి సినిమాను చూసి ఎంజాయ్ చేస్తుండటం ఈమధ్య కాలంలో అరుదైనప్పటికీ రాకాస సినిమా ఆ ఫీలింగ్‌ను మళ్లీ తీసుకొచ్చింది. ఆడియెన్స్ అందరూ సినిమా చూసి కుటుంబంతో కలిసి చక్కగా నవ్వుకుని వెళుతుండటం మంచి పరిణామం.
సినిమాకు లభిస్తోన్న ఆదరణ కలెక్షన్స్ రూపంలో బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తోంది. రోజు రోజుకి సినిమా కలెక్షన్స్ పెరుగుతుండటమే అందుకు కారణం. మూడు రోజుల్లో రాకాస సినిమా రూ.15.80 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను సాధించింది. సినిమాను ఆడియెన్స్ ఓన్ చేసుకున్నారు. కుటుంబంతో కలిసి బయటకు వెళ్లాలంటే ముందుగా ఈ సినిమాను ఆప్షన్‌గా తీసుకుంటున్నారు. అందుకునే సినిమాను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. సినిమాకు హిట్ మౌత్ టాక్ కూడా కలిసి రావటం శుభ సూచకం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్‌సీస్‌లోనూ ఈ సినిమాకు అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే సినిమాకు 250K (రెండున్నర లక్షల) డాలర్ల వసూళ్లను సాధించటం అక్కడ సినిమాకు లభిస్తోన్నరెస్పాన్స్‌ను సూచిస్తోంది. సింపుల్ హ్యుమల్, రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతుండటంతో వీకెండ్‌లో సినిమాకు తొలి ప్రాధాన్యమిచ్చారు.
రాకాస సినిమాకు ఇంత మంచి ఆదరణ రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. సినిమా చక్కటి అర్థవంతమైన కామెడీతో రూపొందింది. సంగీత్, గెటప్ శీను ట్రాక్ ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఇది అన్ని వయసుల వారికి నవ్విస్తోంది. దీంతో పాటు వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్, నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. తనదైన యాక్టింగ్‌తో వెన్నెల కిషోర్ సన్నివేశాన్ని మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చారు.
ప్రేక్షకుల రెస్పాన్స్ సోషల్ మీడియాలో కూడా బలంగా కనిపిస్తోంది. థియేటర్లలో సినిమా ఎలా కనెక్ట్ అవుతుందో పోస్టులు, రియాక్షన్స్ రూపంలో స్పష్టంగా తెలుస్తోంది. వీడియోలు, కామెంట్స్‌లో పిల్లలు విజువల్స్, కామెడీ సీన్స్‌కి ఎగ్జైట్మెంట్‌తో రియాక్ట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. అలాగే ఫ్యామిలీలు తమ థియేటర్ అనుభవాన్ని రిలాక్స్‌గా, నవ్వులతో నిండిన అవుటింగ్‌గా షేర్ చేస్తున్నారు. చాలామంది ఈ సినిమాను ‘నో-స్ట్రెస్ వాచ్’ అని, ‘పక్కా ఫ్యామిలీ థియేటర్ సినిమా’ అని అంటున్నారు. కుటుంబమంతా కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే సినిమాగా ఉండటమే సినిమాకు పెద్ద ప్లస్‌గా మారుతోంది.
‘రాకాస’ ప్రత్యేకంగా ఇంత మంచి విజయాన్ని సాధించటానికి కారణం.. ఇది అన్ని తరాల ప్రేక్షకులకు కనెక్ట్ కావటమే. పిల్లలు ఇందులోని ఫాంటసీ, ఊహాజనిత ఎలిమెంట్స్‌కి ఆకర్షితులవుతుంటే, పెద్దవాళ్లు హ్యూమర్, పాత్రల మధ్య ఉండే డైనమిక్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా బ్యాలెన్స్‌డ్‌గా సినిమాను రూపొందించటంతో కుటుంబమంతా కలిసి థియేటర్స్‌కు వస్తోంది.
ఫ్యామిలీస్ రాకాస సినిమాను బలంగా ముందుకు తీసుకెళుతుంటంతో సినిమాకు రోజు రోజుకీ ఆదరణ పెరుగి సమ్మర్ ఎంటర్‌టైనర్‌గా మెప్పిస్తోంది.ఇంత భారీ విజయానికి కారణం కారణం ఫ్యామిలీ ఆడియెన్స్ కారణం. రోజు రోజుకి సినిమాకు ఆదరణ పెరుగుతూ సినిమా థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రం ‘రాకాస’. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు.



