Skip to content

రాజమహేంద్రవరంలో ‘భోగి’ కొత్త షెడ్యూల్ ప్రారంభం

  • MOVIES
  • Vishwanath
రాజమహేంద్రవరంలో ‘భోగి’ కొత్త షెడ్యూల్ ప్రారంభం Telugu News
రాజమహేంద్రవరంలో ‘భోగి’ కొత్త షెడ్యూల్ ప్రారంభం Telugu News

ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్న చార్మింగ్ స్టార్ శర్వానంద్, ‘భోగి’ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం శర్వానంద్ , బ్లాక్‌బస్టర్ చిత్రనిర్మాత సంపత్ నందిని తొలిసారిగా చేతులు కలిపారు. ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మాణంతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఇది శర్వానంద్ కెరీర్‌లో అత్యంతప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది.

ఫస్ట్-లుక్ విడుదలకు లభించిన అద్భుత స్పందన నేపథ్యంలో, చిత్ర బృందం ఇప్పుడు రాజమండ్రిలో అత్యంత కీలకమైన, లెన్తీ షెడ్యూల్‌ను ప్రారంభించింది. షూటింగ్ రాంపచోడవరం అడవులలోని కఠినమైన, సవాలుతో కూడిన ప్రదేశాలలో జరగనుంది. ఇక్కడ ఎక్సయిటింగ్, టఫ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ సన్నివేశాలను ప్రముఖయాక్షన్ కొరియోగ్రాఫర్ ధిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారు. ఇవి ప్రేక్షకులను లీనమయ్యేలా చేసే యాక్షన్ అనుభూతిని అందించనునాయి. ప్రధాన తారాగణంతో పాటు శర్వానంద్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఇది సినిమా నిర్మాణంలో ఒక కీలక ఘట్టంగా నిలుస్తోంది.

“ఎ బ్లడ్ ఫెస్ట్” అనే ఆకట్టుకునే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ‘భోగి’ చిత్రంలో శర్వానంద్ ఒక సరికొత్త అవతార్ లో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఆయన ట్రాన్స్ ఫర్మేషన్ అంచనాలు పెంచింది.

దర్శకుడు సంపత్ నంది, 1960లో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వాస్తవికమైన కథనం,పవర్ ఫుల్ నేపథ్యంతో ఈ చిత్రం ఇంటెన్స్ డ్రామాతో గొప్ప ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.

ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు.

‘భోగి’టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. కిరణ్ కుమార్ మన్నె ప్రొడక్షన్ డిజైన్, కిషోర్ కుమార్ అరోకియా సినిమాటోగ్రఫీ, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా భోగి బ్లాస్టింగ్ సినిమాటిక్ అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది.

రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్ట్ 28, 2026న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా థియేటర్‌లలో విడుదల కానుంది.

తారాగణం: చార్మింగ్ స్టార్ శర్వా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి, రోహిత్ పాఠక్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కేకే రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
సమర్పణ: లక్ష్మీ రాధామోహన్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
DOP: కిషోర్ కుమార్ ఆరోకియా
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.