Skip to content

జి.వి. ప్రకాష్ కుమార్‌ హీరోగా కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ – హరిహరన్ రామ్

  • MOVIES
  • Vishwanath
జి.వి. ప్రకాష్ కుమార్‌ హీరోగా కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ – హరిహరన్ రామ్ Telugu News

లార్క్ స్టూడియోస్, ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ తమ కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించాయి. ఇందులో జి.వి. ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. వారి బ్లాక్‌బస్టర్ చిత్రాలైన ‘కరుడన్’, ‘మామన్’ తర్వాత లార్క్ స్టూడియోస్ నిర్మిస్తున్న మూడవ చిత్రం ఇది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
విమర్శకుల పరంగా, కమర్షియల్ గా విజయం సాధించిన ‘జో’ చిత్రంతో విశేష ప్రశంసలు పొందిన హరిహరన్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా సంగీతం కూడా అందిస్తున్నారు. ఈ చిత్రం ఆయన ఒక సరికొత్తగా కనిపించనున్నారు.
‘జో’ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మాలవిక మనోజ్, జి.వి. ప్రకాష్ కుమార్ సరసన కథానాయికగా నటిస్తున్నారు.
‘కర్ణన్’, ‘వాళై’ వంటి చిత్రాలలో తన విజువల్స్ తో ఆకట్టుకున్న తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల గురించి వివరాలు మేకర్స్ తెలియజేయనున్నారు.
ఈ చిత్రం జూన్‌లో ప్రారంభం కానుంది. ఇప్పటికే లొకేషన్ల అన్వేషణ జరుగుతోంది.

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.