Skip to content

‎అనారోగ్యంతో బాధపడుతున్న యువతికి ‎ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహాయం!

‎అనారోగ్యంతో బాధపడుతున్న యువతికి ‎ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహాయం! Telugu News

మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. నూజివీడు మండలం ‘పొలసానిపల్లి’ గ్రామానికి చెందిన 25 సంవత్సరాల స్వాతి అనే యువతి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతోంది. గత కొంతకాలంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంటున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ పరిస్థితుల్లో తల్లీ తండ్రి లేని ఆమె, తన పెదనాన్నను తోడుగా తీసుకుని శుక్రవారం రాత్రి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఆయన నివాసంలో కలిసి తన ఆరోగ్య, ఆర్ధిక పరిస్థితులను వివరించింది. తీవ్ర ఆయాసంతో, మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతూ తన సమస్యను చెబుతున్న ఆమె పరిస్థితిని చూసి ఎంపీ చలించారు. 25 ఏళ్ల వయసున్న ఆమె ఊపిరితిత్తుల వ్యాధితో శరీరం ఎముకల గూడులా మారడంతో 10 ఏళ్ల బాలిక స్థాయికి శరీరం కృశించిపోయింది. ఆమె పరిస్థితిని చూసి చలించిపోయిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెంటనే అప్పటికప్పుడు తక్షణ ఆర్థిక సహాయంగా 20 వేల రూపాయలు అందించడమే కాకుండా ఆమెకి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కొద్ది సమయం కూడా నిలబడలేకపోతున్న స్వాతి పరిస్థితిని గమనించి, ఒక మూడు చక్రాల వాహనాన్ని కూడా అందిస్తానని హమీ ఇచ్చిన ఎంపీ, ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక కేటగిరీ కింద పెన్షన్ ఇప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ధైర్యంగా ఉంటూ మెరుగైన వైద్యం చేయించుకోవాలని ఆమెకు సూచించారు.