Skip to content
పరిమళించిన మానవత్వం.. అనారోగ్య బాధిత యువతికి అండగా నిలబడ్డ ఏలూరు ఎంపీ Telugu News

పరిమళించిన మానవత్వం.. అనారోగ్య బాధిత యువతికి అండగా నిలబడ్డ ఏలూరు ఎంపీ

‎.. కొద్ది రోజుల క్రితం ఏలూరు ఎంపీను ఆశ్రయించిన ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తురాలు. ‎.. ఆర్ధిక సాయం చేయటంతో పాటు, వైద్య సహాయం చేస్తానని మాటిచ్చిన ఎంపీ పుట్టా. ‎.. ఇచ్చిన మాట ప్రకారం ఆసుపత్రిలో చేర్పించి ప్రత్యేక ఆహారం అందించే ఏర్పాటు. ‎.. నడవలేని స్థితికి చేరిన యువతికి మూడు రోజుల్లోనే తన సిబ్బందితో వీల్‌ ఛైర్‌ పంపిన ఎంపీ. ‎.. ఏ ఇబ్బంది వచ్చినా తన దృష్టికి తేవాలని, తాను అండగా ఉంటానని హామీ. ‎.. ఎంపీ మానవతా దృక్పధానికి నెట్టింట్లో వెల్లువెత్తుతున్న ప్రశంసలు. ‎ ‎ఏలూరు, మే 18: వివిధ సమస్యలపై తమ వద్దకు వచ్చే ప్రజలకు హామీలు ఇవ్వటం, కొన్ని సందర్భాల్లో ఎంతో కొంత ఆర్ధిక సాయం చేయటం…

Read more
‎అనారోగ్యంతో బాధపడుతున్న యువతికి ‎ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహాయం! Telugu News

‎అనారోగ్యంతో బాధపడుతున్న యువతికి ‎ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహాయం!

మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. నూజివీడు మండలం 'పొలసానిపల్లి' గ్రామానికి చెందిన 25 సంవత్సరాల స్వాతి అనే యువతి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతోంది. గత కొంతకాలంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంటున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ పరిస్థితుల్లో తల్లీ తండ్రి లేని ఆమె, తన పెదనాన్నను తోడుగా తీసుకుని శుక్రవారం రాత్రి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఆయన నివాసంలో కలిసి తన ఆరోగ్య, ఆర్ధిక పరిస్థితులను వివరించింది. తీవ్ర ఆయాసంతో, మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతూ తన సమస్యను చెబుతున్న ఆమె పరిస్థితిని చూసి ఎంపీ చలించారు. 25 ఏళ్ల వయసున్న ఆమె ఊపిరితిత్తుల వ్యాధితో శరీరం ఎముకల గూడులా మారడంతో 10 ఏళ్ల…

Read more
CMRF చెక్కుల  పంపిణీ Telugu News

CMRF చెక్కుల పంపిణీ

ఏలూరు క్యాంపు కార్యాలయంలో 30 మంది లబ్ధిదారులకు 22 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. గత 23 నెలల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చిన 1200 పైగా లబ్ధిదారులకు CMRF ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. అనంతరం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన వారి సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

Read more
కొల్లేరు సమస్యపై కీలక చర్చలు.. CEC ఛైర్మన్‌తో భేటీ Telugu News

కొల్లేరు సమస్యపై కీలక చర్చలు.. CEC ఛైర్మన్‌తో భేటీ

కొల్లేరుపై సుప్రీం కోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ (CEC) ఛైర్మన్ సీపీ గోయల్ గారిని విజయవాడ ఎయిర్ పోర్టులో కలిసి, ఎయిర్ పోర్టు లాబీలో భేటీ అయ్యి కొల్లేరు సమస్యపై చర్చించడం జరిగింది. లక్షలాది ఆక్వా రైతుల, ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన కొల్లేరు సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరడం జరిగింది. పర్యావరణ పరిరక్షణకు భంగం కలగకుండా, అదే సమయంలో స్థానిక ప్రజల న్యాయసమ్మత హక్కులు, జీవనోపాధి కాపాడేలా కాంటూరు కుదింపు అంశం పరిశీలించి త్వరగా సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించాలని కోరగా CEC ఛైర్మన్ గోయల్ గారు సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరలో నివేదిక సమర్పిస్తామని గోయల్ గారు హమీ ఇవ్వడం జరిగింది.

Read more
మై బేబి ఈనెల 11న విడుదల Telugu News

మై బేబి ఈనెల 11న విడుదల

ఇటీవల విడుదలై తమిళంలో సూపర్ హిట్ అయిన డి ఎన్ ఏ సినిమాను ఎస్. కె. పిక్చర్స్ ద్వారా సురేష్ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సినిమా తెలుగులో ‘మై బేబి’ పేరుతో జూలై 11న విడుదల కానుంది. గతంలో ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’ 'షాపింగ్ మాల్ ' 'పిజ్జా' వంటి విజయవంతమైన 15 చిత్రాలను నిర్మాతగా విడుదల చేసిన సురేష్ కొండేటి గతంలో డిస్ట్రిబ్యూటర్ గా 85 పైగా చిత్రాలను విడుదల చేశారు. ఇప్పుడు నిర్మాతగా 16వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ‘మై బేబి’ ప్రోడ్యూసర్ గా తనకు తెలుగులో 16వ చిత్రమని, ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. నెల్సన్ వెంకటేసన్…

Read more