Skip to content

AVAA జర్నీకి శ్రీకారం చుట్టిన విష్ణు మంచు

AVAA జర్నీకి శ్రీకారం చుట్టిన విష్ణు మంచు Telugu News

సినిమా రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే లక్ష్యంతో AVAA ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో AVAA ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ పోటీకి టాలీవుడ్ హీరో, నిర్మాత విష్ణు మంచు నాయకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు “రోడ్ టు AVAA ఎంటర్‌టైన్‌మెంట్” అనే పేరుతో ప్రోమో విడుదల చేయగా.. దీనికి భారీ స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా 11,000కు పైగా ఇంక్విరీస్ రాగా, 3,000కు మించిన షార్ట్ ఫిల్మ్ ఎంట్రీలు వచ్చాయి.

వచ్చిన అన్ని అప్లికేషన్స్ నుంచి టాప్ 100 షార్ట్ ఫిలిమ్స్ ఎంపిక చేశారు. ఈ చిత్రాలను ఫిబ్రవరి 19 నుంచి AVAA ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ షోకు టాలీవుడ్ నటుడు శివ బాలాజీ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ 100 చిత్రాల్లో నుంచి టాప్ 15 చిత్రాలను సెలెక్ట్ చేసి ఆ తర్వాత గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నారు. ఈ ఫినాలే తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరగనుంది. ఉత్కంఠభరితమైన ఛాలెంజ్‌లతో వేడుకగా ఈ ఫినాలే నిర్వహిస్తామని మేనేజ్‌మెంట్ చెబుతోంది.

ఈ ప్రక్రియ అనంతరం మార్చి 19న ఫైనల్ విజేతను ప్రకటించనున్నారు. ఈ పోటీలో విజేతగా నిలిచిన వారికి AVAA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో 10 కోట్ల బడ్జెట్‌తో ఫీచర్ ఫిల్మ్ దర్శకత్వం చేసే అరుదైన అవకాశం లభించనుంది. సినీ ప్రపంచంలో కొత్త ప్రతిభను వెలికి తీసే ఈ ప్రయాణం పట్ల అంతా ఆసక్తిగా ఉన్నారు.

See also  "యూత్" మూవీ ఘన విజయం సాధిస్తుంది - హీరో శ్రీ విష్ణు

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.