Skip to content

బరాబర్ బాధపడుతున్నాను!! – జె. డి. చక్రవర్తి

  • MOVIES
  • Vishwanath
బరాబర్ బాధపడుతున్నాను!!  – జె. డి. చక్రవర్తి Telugu News

ఇటీవల తాను అతిధిగా పాల్గొన్న సినిమా ఫంక్షన్ లో జరిగిన దానికి బాధపడుతున్నానని తెలిపారు ప్రముఖ నటులు జె.డి.చక్రవర్తి. ఆయన మాట్లాడుతూ… “సినిమాలకు ప్రచారం కల్పించేందుకు ఘోరంగా దిగజారిపోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. ఇటీవల నేను అతిధిగా పాల్గొన్న ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో… ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉండిపోయాను. మధ్యలోనే వచ్చేసి ఉండాల్సిందని ఇప్పుడు బాధపడుతున్నాను. సృజనాత్మకతమైన ఆలోచనలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలే తప్ప, రోత పుట్టించే జుగుప్సాకరమైన వేష, “భాష”లతో కాదని నేను బలంగా నమ్ముతాను” అని జె.డి.చక్రవర్తి అన్నారు. ఈమేరకు ఆయన ఒక వీడియో సైతం విడుదల చేశారు!!

Vishwanath

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.