నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన పాన్ వరల్డ్ సినిమా 'ది ప్యారడైజ్' షూటింగ్లో బిజీగా…
‘బుకీ’ అందరూ రిలేట్ అయ్యే సినిమా : విజయ్ ఆంటోనీ

అజయ్ దిషన్, ధనుషా హీరో హీరోయిన్స్ గా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘బుకీ’. విజయ్ ఆంటోనీ సమర్పణలో శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రామంజేయులు జవ్వాజీ నిర్మించారు. సునీల్, లక్ష్మి మంచు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే తమిల్ లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని అందుకుంది. తెలుగులో ఈ సినిమా ఫిబ్రవరి 20న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో మూవీ ప్రజెంటర్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ వేడుకకు మంచు లక్ష్మి గారు రావడం చాలా ఆనందంగా ఉంది. వారితో కలిసి మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. గణేష్ అద్భుతమైన డిఓపీ, దర్శకుడు. ఈ సినిమా మ్యాసీవ్ హైబడ్జెట్ మూవీలా కనిపించదానికి కారణం కూడా తన విజన్. ఈ సినిమా తర్వాత కచ్చితంగా మీరందరూ ఆయన్ని సపోర్ట్ చేస్తారు. భాష్యశ్రీ గారితో బిచ్చగాడు నుంచి జర్నీ కొనసాగుతోంది. ఈ సినిమాకి ఇచ్చిన అద్భుతమైన మాటలు రాశారు. అజయ్ మార్గన్ తో చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బుకీ కూడా తన నటన మీ అందరినీ అలరిస్తుంది. తెలుగు ఆడియన్స్ ఒక మంచి టాలెంట్ ని సపోర్ట్ చేస్తారు. తనని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ధనుషా స్క్రీన్ పై చాలా క్యూట్ గా ఉంటుంది. ఈ సినిమాలో లక్ష్మి గారు, సునీల్ గారి పెర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. ఈ సినిమా క్లైమాక్స్ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా కన్నీళ్లు వస్తాయి. అంతా రిలేట్ చేసుకునేలా ఉంటుంది. నిర్మాత రామ్ గారితో మార్గన్ నుంచి అసోసియేషన్ ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ కి కృతజ్ఞతలు. వారితో మా అసోసియేషన్ కొనసాగుతుంది. చాలా మంచి సినిమా. ఫిబ్రవరి 20న థియేటర్స్ లో చూసి తప్పకుండా మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
యాక్ట్రెస్ మంచు లక్ష్మి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. గత శుక్రవారం ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ ని అందుకుంది. ఇది యూనివర్సల్ గా కరెక్ట్ అయ్యే సిని.మా అజయ్ ధనుషా ఇలా మంచి టీం తో కలిసి చేసిన సినిమా ఇది. విజయ్ గారు ఒక సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నారంటే ఆ కంటెంట్ అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్ గణేష్ కి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ సినిమాలో చాలా ఆసక్తికరమైన క్యారెక్టర్ చేశాను. ఇందులో క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్స్ చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఈ సినిమా తమిళ్లో అద్భుతమైన పేరు సంపాదించుకుంది. ఇది యూత్ ఫుల్ సినిమా. తెలుగులో కూడా సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను.
హీరో అజయ్ దిషన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మార్గన్ లో నా నటన ఇష్టపడడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ సినిమా నాకు ఒక గుర్తింపు ఇచ్చింది. హీరోగా నేను చేస్తున్న ఫస్ట్ సినిమా బుకీ. ఈ అవకాశం నాకు ఇచ్చిన విజయ్ అంటోని గారికి కృతజ్ఞతలు. మార్గన్ సినిమా రిలీజ్ అవ్వకముందే నాకు ఈ అవకాశం ఇస్తానని ఆయన చెప్పారు. ఆయన నమ్మకానికి కృతజ్ఞతలు. అందరూ రిలేట్ చేసుకునే క్యారెక్టర్ లో కనిపిస్తాను. ఈ సినిమా చేస్తున్నప్పుడు నా లైఫ్ నే సినిమాగా తీస్తున్నట్టుగా అనిపించింది. విజయ్ గారు చాలా రోజుల తర్వాత వేరే హీరో సినిమాకి మ్యూజిక్ చేశారు. అది నా సినిమా కావడం చాలా ఆనందంగా ఉంది. సినిమా మ్యూజికల్ గా అద్భుతంగా ఉంటుంది. ధనుషా అద్భుతంగా నటించింది. అందరూ కూడా ఈ సినిమాని థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
హీరోయిన్ ధనుషా మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది నా ఫస్ట్ సినిమా. హీరోయిన్ అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోనీ గారికి థాంక్యూ. ఇది నాకు చాలా పెద్ద అవకా.శం తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది. నాకు తెలుగు కొంచెం తెలుసు. నేను తిరుపతిలో పుట్టాను. మా అమ్మ గారిది తిరుపతి. అందరూ ఫిబ్రవరి 20న థియేటర్స్ కి వెళ్లి మా సినిమా చూసి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ గణేష్ చంద్ర మాట్లాడుతూ.. నాకు తెలుగు అనుబంధం వుంది. నేను తమిళ్ అబ్బాయిని. విజయవాడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నాకు ఈసినిమా అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోనీ గారికి థాంక్యూ. సినిమా తమిళ్లో రిలీజ్ అయి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. తెలుగులో ఫిబ్రవరి 20 రిలీజ్ అవుతుంది. అజయ్ తన పాత్రకి పూర్తిగా న్యాయం చేశాడు. ఈ పాత్రలో తనను తప్పితే మరొకరిని ఊహించుకోలేని. ధనుష ఈ క్యారెక్టర్ కి లైఫ్ ఇచ్చారు.భాష్యశ్రీ గారు తెలుగులో అద్భుతంగా మాటలు రాశారు. తమిళ్ కంటే తెలుగులో బావుంది. లక్ష్మీ గారు, సునీల్ గారు క్యారెక్టర్స్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో ఇంకా చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది. సినిమా చూస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది. ఈ సినిమాని అందరూ థియేటర్స్ లో చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న సురేష్ ప్రొడక్షన్ హౌస్ కి కృతజ్ఞతలు.
రైటర్ భాష్యశ్రీ మాట్లాడుతూ.. మనం ప్రేమించిన అమ్మాయిని ముద్దుగా పిలుచుకునే పేరు బుకీ. బ్రేకప్ తో ఈ సినిమా మొదలవుతుంది. ఇందులో తొమ్మిది పాటలు ఉన్నాయి. విజయ్ గారు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. మ్యూజిక్ ఫోటోగ్రఫీ అదిరిపోతుంది. అజయ్ గారు అద్భుతంగా చేశారు. చాలా అద్భుతమైన సినిమా ఇది. ఇలాంటి సినిమాకు నాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. తమిళ్ లో ఈ సినిమా చాలా మంచి ఆదరణ అందుకుంది. తెలుగులో కూడా ఇంకా అద్భుతమైన ఆదరణ వస్తుందని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.
నటీనటులు: అజయ్ దిషన్, ధనుష, పాండియరాజన్, సునీల్, లక్ష్మి మంచు, ఇందుమతి మణిగండన్, వివేక్ ప్రసన్న, బ్లాక్ పాండి, ఆదిత్య, బిగ్ బాస్ సత్య, M.J శ్రీరామ్, రాధ, అశ్విన్ రామ్, షియారా శర్మి, ప్రియాంక
సాంకేతిక సిబ్బంది:
ప్రజెంట్స్: విజయ్ ఆంటోనీ
దర్శకత్వం-డీవోపీ: గణేష్ చంద్ర
నిర్మాత: రామంజేయులు జవ్వాజీ
బ్యానర్: శరవంత్ రామ్ క్రియేషన్స్, విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్
మ్యూజిక్ : విజయ్ ఆంటోనీ
రైటర్: పుతియ పరిథి
పీఆర్వో: వంశీ శేఖర్
