Skip to content

న్యూయార్క్‌లో భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన ‘ది స్టోరీటెల్లర్ యూనివర్స్’ ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం

భారతీయ మూలాలు కలిగిన ప్రముఖ ఫిల్మ్‌మేకర్, నటుడు, నిర్మాత వెంకట్ సాయి గుండా న్యూయార్క్ నగరంలో 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌ను విజయవంతంగా ప్రారంభించారు. ఈ బూటిక్ ఫెస్టివల్ స్వతంత్ర కథకులకు ప్రపంచ వేదికగా నిలిచింది. కరీంనగర్ (తెలంగాణ)కు చెందిన వెంకట్ సాయి గుండా, తన ఫీచర్ ఫిల్మ్ 'ది డిజర్వింగ్'తో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఇది 25కి పైగా ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ అయి, అనేక అవార్డులు సాధించింది. ఇప్పుడు ఫెస్టివల్ డైరెక్టర్‌గా, స్వతంత్ర సినిమాలకు మద్దతు ఇచ్చేలా ఈ వేదికను ఏర్పాటు చేశారు. జనవరి 10-11, 2026న న్యూయార్క్‌లో జరిగిన తొలి ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఫిల్మ్‌మేకర్లు, కళాకారులు హాజరయ్యారు. వ్యాపారం కంటే భావోద్వేగాలు, నిజాయితీ,…

Read more

*రాజు వెడ్స్ రాంబాయి” సినిమాకు ప్రేక్షకులంతా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు – బన్నీ వాస్

అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన "రాజు వెడ్స్ రాంబాయి" సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని దక్కించుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ఈ సినిమాకు ప్రశంసలు అందిస్తున్నారు. "రాజు వెడ్స్ రాంబాయి" చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చారు. "రాజు వెడ్స్ రాంబాయి" విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ చిత్ర సక్సెస్ మీట్…

Read more

‘హరి హర వీరమల్లు’ హక్కులకు పెరిగిన డిమాండ్

పవన్ కళ్యాణ్ నూతన చిత్రం 'హరి హర వీరమల్లు' తెలంగాణకు చెందిన ఓ వీరుడి కథ ఆధారంగా రూపొందించబడిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదు. ఈ చిత్రం నిజ జీవితంలోని ఏ ఒక్క నాయకుడి కథ ఆధారంగానూ తెరకెక్కలేదు. సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి ప్రయాణాన్ని తెలిపే కల్పిత కథగా ఇది తెరకెక్కింది. జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత 'హరి హర వీరమల్లు' కథ పూర్తిగా మారిపోయింది. దర్శకుడు కథలోని స్ఫూర్తిని, సారాన్ని అలాగే ఉంచుతూ.. సరికొత్త కథగా దీనిని మలిచారు. పురాణాల ప్రకారం, అయ్యప్ప స్వామిని శివుడు-మోహినిల కుమారుడిగా, శైవం మరియు వైష్ణవం మధ్య వారధిగా ఎలా వర్ణిస్తారో.. అలాగే 'హరి హర…

Read more

జూలైలో “దీక్ష” సినిమా

ఆర్ కె ఫిలిమ్స్ బ్యానర్‌‌లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో కిరణ్, ఆలేఖ్య రెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్సా ఖాన్, తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం "దీక్ష". ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం జూలైలో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్ ప్రెస్‌ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శక, నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ - మా "ఆర్కే దీక్ష" సినిమాకు సంబంధించిన డబ్బింగ్, మిక్సింగ్, రీ రికార్డింగ్ పూర్తి అయ్యాయి. జూలై మొదటి వారంలో మా మూవీ ట్రైలర్ రిలీజ్ చేసి జూలై…

Read more

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, రామ్ ఆచంట, గోపీ ఆచంట, 14 రీల్స్ ప్లస్, ఎం తేజస్విని నందమూరి ప్రజెంట్స్ ‘అఖండ 2: తాండవం’ దసరా స్పెషల్ గా సెప్టెంబర్ 25న పాన్-ఇండియా రిలీజ్- సెన్సేషనల్ బర్త్ డే టీజర్ రిలీజ్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ 'అఖండ 2: తాండవం' కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ఈ హై-ఆక్టేన్ సీక్వెల్ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం.. ప్రతి అంశంలో అఖండను మించి ఉంటుదని హామీ ఇస్తోంది. ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు(జూన్ 10) పురస్కరించుకొని 'అఖండ 2: తాండవం' సెన్సేషనల్ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అదిరిపోయింది. ఈ టీజర్ తో బాలయ్యకు బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ అందించింది…

Read more

ఈ నెల 11న హీరో నితిన్, డైరెక్టర్ శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ క్రేజీ మూవీ “తమ్ముడు” ట్రైలర్ రిలీజ్, జూలై 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ "తమ్ముడు". ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న "తమ్ముడు" సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు "తమ్ముడు" సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు క్రియేటివ్ గా, ఎంటర్ టైనింగ్ వీడియోతో తెలిపారు. "తమ్ముడు" మూవీ ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ వీడియో ఫన్నీగా డిజైన్ చేశారు. తాను గట్టిగా అడిగినందు…

Read more

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన సుడిగాలి సుధీర్ మోస్ట్ పాపులర్ గేమ్ షో ‘సర్కార్ సీజన్ 5’

వర్సటైల్ కంటెంట్ ఉన్న మూవీస్, వెబ్ సిరీస్, గేమ్ షోస్, కుకరీ షోస్ తో ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది ఆహా ఓటీటీ. ఆహా ఓటీటీలో సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ఆడియెన్స్ ఫేవరేట్ గేమ్ షోగా 'సర్కార్' పేరు తెచ్చుకుంది. ఇప్పుడీ గేమ్ షో సీజన్ 5 స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు 'సర్కార్ సీజన్ 5' స్ట్రీమింగ్ అవుతుంది. ఈ గేమ్ షో లో సెలబ్రిటీ గెస్ట్స్ ఫుల్ ఎంటర్ టైన్ అందిస్తారు. సర్కార్ సీజన్ 5లో సరికొత్త సెగ్మెంట్ సర్కార్ తో ఆటను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ గేమ్ షోలో ప్రేక్షకులు తమ ఇంటి వద్ద నుంచే పాల్గొనవచ్చు. అలాగే ఆహాలో…

Read more

ప్రముఖ కమెడియన్ అలీ క్లాప్ తో లాంఛనంగా ప్రారంభమైన “చండీ దుర్గమా” సినిమా

మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో పాటు నూతన నటీనటులను పరిచయం చేస్తూ హెచ్ బి జె క్రియేషన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా చండీ దుర్గమా. ఈ సినిమాకు జయశ్రీ వెల్ది నిర్మాత. ఒలి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైను ఖాన్ ఎండీ దర్శకత్వం వహిస్తున్నారు. చండీ దుర్గమా సినిమా పూజా కార్యక్రమాలతో ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కమెడియన్ అలీ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. కెమెరా స్విచ్ ఆన్ నటుడు చిట్టి చేయగా, ముహూర్తపు సన్నివేశానికి రఘు కారుమంచి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా….. ప్రముఖ కమెడియన్ అలీ మాట్లాడుతూ - చండీ దుర్గమా సినిమా ప్రారంభోత్సవానికి…

Read more

‘కన్నె’లో మాటలకందని భావాలెన్నో..

- సంగీతప్రియుల నుంచి విశేష స్పందన హైదరాబాద్, జూన్ 8, 2025: ఈ స్వరంలో ఏదో మాయ ఉంది, వింటుంటే మనస్సు పులకించిపోతుంది. వినే కొద్దీ వినాలనిపిస్తుంది. అది స్వరం కాదు, హృదయాన్ని మాయ చేసే ఒక మంత్ర స్వరం. ఆ గళంలోని ప్రతి నాదం మనస్సును మెలిపెట్టేస్తుంది. ఆ సంగీత సంచలనం ఎవరో కాదు, మన సిద్ శ్రీరామ్. ఆయన సరికొత్త గీతం 'కన్నె'లో మాటలకందని భావాలను పలికించారు. ఇది ఒక ప్రేమ గీతం. ఈ పాటను అయనే స్వయంగా కంపోజ్ చేసి, పాడారు. తమిళంలో వివేక్, తెలుగులో కిట్టు విస్సాప్రగడ రచించారు. ఈ పాటను ఈనెల 6వ తేదీన వార్నర్ మ్యూజిక్ విడుదల చేసింది. ఏప్రిల్‌లో భక్తిగీతం 'శివనార్‌' విడుదల…

Read more

సరికొత్త కథాంశంతో.. సరికొత్తగా ‘పయనం’ చిత్రం ప్రారంభం

రోటి కపడా రొమాన్స్‌ చిత్రంతో కథానాయకుడిగా తనకంటూ ఓ గుర్తింపు పొందిన సుప్రజ్‌ హీరోగా, 'జనక అయితే గనక' చిత్రంలో తన అభినయంతో మెప్పించిన సంగీర్తన విపిన్‌ నాయికగా నటిస్తున్న నూతన చిత్రం 'పయనం' ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఛాయచిత్రాలు పతాకంపై చందురామ్‌ దర్శకత్వంలో స్వర్ణ కమల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రఘు మాస్టర్‌ క్లాప్‌ నివ్వగా, నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె కెమెరా స్వీచాన్‌ చేశారు. ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ 'ఇదొక కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న చిత్రమిది. డ్రామా సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్‌ చేసే అంశాలు చాలా ఉంటాయి. అవసరాల శ్రీనివాస్‌ మా…

Read more