Skip to content

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన సుడిగాలి సుధీర్ మోస్ట్ పాపులర్ గేమ్ షో ‘సర్కార్ సీజన్ 5’

sudhir

వర్సటైల్ కంటెంట్ ఉన్న మూవీస్, వెబ్ సిరీస్, గేమ్ షోస్, కుకరీ షోస్ తో ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది ఆహా ఓటీటీ. ఆహా ఓటీటీలో సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ఆడియెన్స్ ఫేవరేట్ గేమ్ షోగా ‘సర్కార్’ పేరు తెచ్చుకుంది. ఇప్పుడీ గేమ్ షో సీజన్ 5 స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ‘సర్కార్ సీజన్ 5’ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ గేమ్ షో లో సెలబ్రిటీ గెస్ట్స్ ఫుల్ ఎంటర్ టైన్ అందిస్తారు.

సర్కార్ సీజన్ 5లో సరికొత్త సెగ్మెంట్ సర్కార్ తో ఆటను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ గేమ్ షోలో ప్రేక్షకులు తమ ఇంటి వద్ద నుంచే పాల్గొనవచ్చు. అలాగే ఆహాలో ఈ గేమ్ షో చూస్తూ డిస్ ప్లే అయ్యే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీకు పంపిన ప్రశ్నలకు సరైన సమాధానాలు వాట్సాప్ ద్వారా పంపితే సర్ ప్రైజ్ గిఫ్ట్ లు గెల్చుకోవచ్చు. గేమ్ షోస్ కు రారాజుగా పిలుస్తున్న సర్కార్..ఈ సీజన్ 5తో మరింతగా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. దీంతో పాటు ప్రతి శుక్రవారం ఆహా సరికొత్త మూవీస్, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.