రెండు తెలుగు రాష్ట్రాలుదాసరి పేరిట అవార్డులివ్వాలి!!
దాసరి ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో వక్తల అభిలాష!! దాసరి సప్తమ వర్ధంతి సందర్భంగా ప్రముఖ నిర్మాత - భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ... దాసరి ఫిల్మ్ అవార్డ్స్ వేడుకను ఘనంగా నిర్వహించారు. దాసరి ప్రియ శిష్యులు - ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ వేడుకలో వంశీ రామరాజు, జైహింద్ గౌడ్, దర్శకుడు బాబ్జి, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు. నాగబాల సురేష్, వైజాగ్ శేషమాంబ తదితరులు దాసరి స్మారక పురస్కారాలు అందుకున్నారు. ఈ సందర్భంగా అతిధులు, సన్మాన గ్రహీతలు దాసరితో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకొని, ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. సినిమా రంగానికి సంబంధించి అన్ని కీలక…
