Skip to content

వరలక్ష్మి శరత్ కుమార్ – నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో ‘పోలీస్ కంప్లెయింట్’ షూటింగ్ పూర్తి

గ్లామ‌ర్ పాత్ర‌లతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్.. లేడీ విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గానూ పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఆడియ‌న్స్‌ను థ్రిల్‌కు గురి చేసే క్యారెక్ట‌ర్‌తో రాబోతోంది. వరలక్ష్మి శరత్ కుమార్ - నవీన్ చంద్ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో దర్శకుడు సంజీవ్ మేగోటి రూపొందిస్తున్న ‘పోలీస్ కంప్లెయింట్’ మూవీ ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాలో వరలక్ష్మి ప‌వ‌ర్‌ఫుల్ పాత్రలో కనిపించ‌నుందని, తొలిసారి పూర్తిగా వినోదాత్మకమైన రోల్‌లో నటించడం ప్రత్యేక ఆకర్షణ అని, సూపర్ స్టార్ కృష్ణ గారిపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాతలు తెలిపారు. MSK ప్రమిద శ్రీ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపోందుతున్న ఈ…

Read more

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం.32 టైటిల్ గ్లింప్స్‌ విడుదల

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ టైటిల్ ఖరారు వైవిద్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.32 గా రూపొందుతోన్న చిత్రానికి ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. బేబీ వంటి సంచలన విజయం తరువాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రమిది. '90s' వెబ్ సిరీస్ తో అందరి మనసులు దోచుకున్న ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ…

Read more

యూనివర్సిటీ సినిమాలో అద్భుతమైన ఎమోషన్స్ వున్నాయి… పద్మశ్రీ బ్రహ్మానందం

ప్రముఖ హాస్యనటులు పద్మశ్రీ బ్రహ్మానందం గారు మాట్లాడుతూ: యూనివర్శిటీ అంటే ఏమిటి యూనివర్స్ అంటే విశ్వం . అంటే అన్ని గోళాల తోటి ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి భూమి లాంటి గ్రహమే కాకుండా విశ్వాంతరాళాలలోని గ్రహాలన్నింటికీ సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేర్పేటటువంటిది ఆలయం. అదే విశ్వవిద్యాలయం అదే యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీ ఇపుడు ఎటువంటి విశ్వవిద్యాలయాలు అయ్యాయి అని చెప్పడానికి ఎంతో ఎంతో కృషి చేసి అందులో రీసెర్చ్ చేసి అందులో జరుగుతున్నటివంటి అవనీతిని… అప్పట్లో విశ్వవిద్యాలయాలు అంటే కాశీ విద్యాలయం అని పెద్ద పేరు బెనారస్ యూనివర్సిటీ. ఎక్కడెక్కడి నుంచో అన్ని దేశాల నుంచి మనదేశం వచ్చి చదువుకొనివెళ్లిపోయేవారు. అంటే అంత జ్ఞాన సంపద ఉన్న దేశం మనది. ఈవాళ మన దేశం…

Read more

ఒకేసారి 15 చిత్రాలు ప్రారంభం

భీమవరం టాకీస్ పతాకంపై ఇప్పటికే 114 చిత్రాలను నిర్మించి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ... ప్రపంచ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఒకేసారి 15 చిత్రాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో కిక్కిరిసిన సినీ అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అతిరధమహారధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మురళీమోహన్, రేలంగి నరసింహారావు, సుమన్, శ్రీకాంత్, జె.డి.చక్రవర్తి, తనికెళ్ళ భరణి, 30 ఇయర్స్ పృథ్వి, అజయ్ ఘోష్, సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, తుమ్మల ప్రసన్నకుమార్, చదలవాడ శ్రీనివాసరావు, భరత్ భూషణ్, వల్లూరిపల్లి రమేష్ బాబు, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్, కె.ఎల్.స్టూడియో అధినేత కొంతం లక్ష్మణ్, గజల్…

Read more

తెలుగు సంస్కృతి, సంప్రదాయాల్ని చాటి చెప్పేలా మా ‘షష్టి పూర్తి’ చిత్రం ఉంటుంది.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్

నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్ లో రూపేశ్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్ పతాకం పై రూపేష్ నిర్మించిన చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ సినిమా మే 30న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక శనివారం (మే 24) నాడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఈస్ట్ శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ , పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ‘మనం ఎవరో తెలియకుండానే ప్రేమించేది తల్లి.…

Read more