Skip to content

“యూత్” మూవీ ట్రైలర్ రిలీజ్

“యూత్” మూవీ ట్రైలర్ రిలీజ్ Telugu News

కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ “యూత్”. ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 26న “యూత్” మూవీ తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ‘కమ్ విత్ యువర్ గ్యాంగ్, నోట్ – నో ఏజ్ లిమిట్’ అనే స్లోగన్ తో ఈ సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

“యూత్” మూవీ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – కాలేజ్ డేస్ లోని కలర్ ఫుల్ లైఫ్ అంతా ఈ ట్రైలర్ లో కనిపించింది. జూనియర్ ఇంటర్ లో చేరిన ప్రవీణ్ అండ్ గ్యాంగ్ చేసే హంగామా ప్రతి ఆడియెన్ ను తమ లైఫ్ మెమొరీస్ గుర్తుచేస్తుంది. ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ లో డ్యాన్సులు, కాలేజ్ లో చేరాక ప్రేమలు, సీనియర్స్ తో ఫైట్స్…ఇవన్నీ ట్రైలర్ తో ఎంతో ఎంటర్ టైనింగ్ గా చూపించారు. మదర్ మేరీ జూనియర్ కాలేజ్ లో చదివే స్టూడెంట్ ప్రవీణ్. అతనిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ప్రవీణ్ కలెక్టర్ అవుతాడని అతని తల్లి నమ్మకం పెట్టుకుంటుంది. తండ్రికి మాత్రం కొడుకు మీద ఎలాంటి ఆశలు ఉండవు. మీ ఫోకస్ అంతా స్టడీస్ మీదే ఉండాలని కాలేజ్ ప్రిన్సిపల్ చెబితే, ప్రవీణ్ మైండ్ లో మాత్రం లవ్ లవ్ లవ్ అనే ఒకే ఒక్క ఆలోచన ఉంటుంది. అందరు కాలేజ్ కుర్రాళ్లలాగే ప్రవీణ్ సినిమా స్టార్స్ ను అభిమానిస్తాడు, అమ్మాయిల ప్రేమ కోసం ప్రయత్నిస్తుంటాడు, కాలేజ్ లో సీనియర్స్ తో ఫైట్స్ చేస్తుంటాడు. ఒకమ్మాయి ప్రేమించినా చాలు అనుకుని ప్రవీణ్ ట్రై చేస్తుంటే, అతన్ని సర్ ప్రైజ్ చేస్తూ ముగ్గురు అందమైన అమ్మాయిలు అతని వెంట పడుతుంటారు. పట్టరాని సంతోషంలో ఉన్న ప్రవీణ్ కు ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటుంది. ఈ ముగ్గురిలో ప్రవీణ్ ను ఎవరు ప్రేమించారు, ప్రవీణ్ ఎవర్ని ప్రేమించాడు అనేది ఆసక్తిని కలిగించింది. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎలాంటి కలలుకన్నారు. తమ కాలేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేసే ఈ స్టూడెంట్స్ పేరెంట్స్ కోసం ఎప్పుడు రియలైజ్ అయ్యారు అనే అంశాలు మూవీలోనే చూడాలి. కెన్ ఎనర్జిటిక్ పర్ ఫార్మెన్స్ ట్రైలర్ కు హైలైట్ గా నిలుస్తోంది. చివరలో ప్రభాస్ “రాఘవేంద్ర” సినిమాలోని ‘కలకత్తా పానేసినా చూసుకో…’ పాట మెరుపుతో ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ముగుస్తుంది. ట్రైలర్ చూస్తే యూత్ ఆడియెన్స్ ను ఈ సినిమా థియేటర్స్ లో ఊపేయడం ఖాయంగా కనిపిస్తోంది.

నటీనటులు – కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్, తదితరులు

టెక్నికల్ టీమ్
——————-
స్క్రిప్ట్, డైరెక్షన్ – కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్
బ్యానర్ – పారవతా ఎంటర్ టైన్ మెంట్స్
ప్రొడ్యూసర్ – కరుపయ్య సి.రామ్, సులోచన కుమార్
తెలుగు రిలీజ్ – ఈ2సీ టాకీస్ (హౌస్ పుల్ వినీత్, సందీప్)
మ్యూజిక్ – జీవీ ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ – వికి
ఎడిటర్ – నాష్
ఆర్ట్ డైరెక్టర్ – రాము తంగరాజ్
కాస్ట్యూమ్ డిజైనర్ – కావ్య శ్రీరామ్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – విజయ్ ఎంపీ
స్టంట్ – కలై కింగ్సన్
కొరియోగ్రఫీ – శోబి పాల్ రాజ్
సౌండ్ డిజైన్ – సింక్ సినిమా
సౌండ్ మిక్స్ – అర్వింద్ మీనన్
మార్కెటింగ్ – హౌస్ ఫుల్ డిజిటల్
పోస్టర్స్ – కబిలన్ చెల్లయ్య
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.