మన శంకరవరప్రసాద్ గారు కోసం తన పాత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న వెంకటేష్
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ ట్రీట్ కానుంది. తాజాగా విక్టరీ వెంకటేష్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టు పెట్టారు. #మన శంకర వర ప్రసాద్ గారు సినిమా కోసం నా భాగం ఈరోజుతో పూర్తయ్యింది. ఇది ఎంతో అద్భుతమైన అనుభవం! నాకు ఎంతో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి’ గారితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎంతోకాలంగా ఎదురుచూశాను. ఆ అవకాశాన్ని ఈ…
