Skip to content

“స్కై” సినిమా నుంచి ‘నిన్ను చూసిన..’ లిరికల్ సాంగ్ రిలీజ్

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా "స్కై". పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న "స్కై" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'నిన్ను చూసిన..' అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు పృథ్వీ పెరిచెర్ల మంచి లిరిక్స్ రాయగా, మనీష్ కుమార్, వైష్ణవి ఆకట్టుకునేలా పాడారు. శివప్రసాద్ బ్యూటిఫుల్ ట్యూన్ తో కంపోజ్ చేశారు…

Read more

“సంతాన ప్రాప్తిరస్తు” మంచి విజయాన్ని సాధిస్తుంది – డైరెక్టర్ బాబీ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్స్ బాబీ, సందీప్ రాజ్, శైలేష్ కొలను, బీవీఎస్ రవి, ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

Read more

ఏఆర్‌ రెహమాన్‌ కాన్సర్ట్‌ లో సందడి చేసిన రామ్‌ చరణ్‌

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌, అస్కార్ విన్నర్ ఏఆర్‌ రెహమాన్‌ కాన్సర్ట్‌ లో సందడి చేశారు. రెహమాన్‌ కాన్సర్ట్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో అట్టహాసంగా జరిగింది. అతిథులుగా హాజరైన రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌, బుచ్చిబాబు సానా ఆడియన్స్ లో మరింత జోష్‌ నింపారు. ‘పెద్ది’ సినిమాలోని చికిరి చికిరి లైవ్ పెర్ఫామెన్స్‌ ని ఆడియన్స్ నుంచి అద్భుతమై రెస్పాన్స్ వచ్చింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. రెహమాన్‌ గారి సంగీతంలో భాగమవ్వాలనేది నా చైల్డ్‌హుడ్‌ డ్రీం. అది నా ప్రాజెక్ట్ ‘పెద్ది’ తో నెరవేరినందుకు చాలా ఆనందంగా వుంది. జాన్వి కపూర్ మాట్లాడుతూ.. పెద్ది సినిమాలో భాగమయ్యే అవకాశం రావడం…

Read more

జయకృష్ణ ఘట్టమనేని హీరోగా లాంచ్

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు, జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా గ్రాండ్‌గా లాంచ్ అవుతున్నారు. ఒక అద్భుతమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, RX 100, మంగళవారం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల విజనరీ ఫిల్మ్ మేకర్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ వెండితెర అరంగేట్రం చేయబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్‌ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణతో కల్ట్ బ్లాక్ బస్టర్ అగ్ని పర్వతం చిత్రాన్ని నిర్మించి, తరువాత రాజకుమారుడుతో ప్రిన్స్ మహేష్ బాబును తెలుగు సినిమాకు పరిచయం చేసిన అశ్విని దత్, ఇప్పుడు మూడవ…

Read more

“గత వైభవం” తెలుగులో గ్రాండ్ గా రిలీజ్

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా గత వైభవ. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కే. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. తమ సక్సెస్ ఫుల్ ట్రాక్‌ రికార్డ్‌, స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌తో ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు ఉత్తర అమెరికా, కెనడాలలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ప్రైమ్‌షో క్రెడిబిలిటీ తో ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు, విదేశీ మార్కెట్లలో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ప్రచార…

Read more

అందరూ ఎంజాయ్ చేసే సినిమా ‘జిగ్రీస్’

కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో మౌంట్ మెరు పిక్చర్స్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ క్రేజీ ఎంటర్‌టైనర్‌ “జిగ్రీస్”. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ వోడపల్లి నిర్మాత. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జిగ్రీస్ నవంబర్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. జిగ్రీస్ 14న రిలీజ్ అవుతుంది. ఇది యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఒక సినిమాలా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. ఒక కొత్త ఫీల్ ఇవ్వడం కోసం చాలా…

Read more

హెల్త్ క్యాంప్ నిర్వహించిన ‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి విష్ణు మంచు ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తరువాత ఆరోగ్యానికి పెద్ద పీఠ వేసిన సంగతి తెలిసిందే

‘మా’ సభ్యుల ఆరోగ్యం కోసం ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్‌లను విష్ణు మంచు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సిటీలోని పెద్ద మల్టీస్పెషాల్టీ హాస్పిటల్స్‌తో కలిసి హెల్త్ క్యాంప్‌లను నిర్వహించారు. ఇక ఈ హెల్త్ క్యాంప్‌లో ‘మా’ సభ్యులంతా పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఇక ఈక్రమంలో ఆదివారం నాడు కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ‘మా’ సభ్యుల కోసం విష్ణు మంచు హెల్త్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘మా’ ప్రెసిడెంట్ విష్ణు మంచు, ‘మా’ ట్రెజరర్ శివ బాలాజీ, రాజీవ్ కనకాల వంటి వారు పాల్గొన్నారు. ఇక హాస్పిటల్ తరుపున కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ సీఓఓ సుధాకర్ జాదవ్, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డా. నవ వికాస్…

Read more

తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జోడీగా కొత్త సినిమా ప్రారంభం

లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ప్రీ వెడ్డింగ్ షో'తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తిరువీర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. సంక్రాంతికి వస్తున్నాం విజయం తర్వాత ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం భరత్ దర్శన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి ప్రొడక్షన్ నంబర్ 2 గా నిర్మిస్తున్నారు. తమ ఫస్ట్ ప్రొడక్షన్ శివమ్ భజేతో ప్రేక్షకులని అలరించిన గంగాఎంటర్‌టైన్‌మెంట్స్, మరో ఎక్సయిటింగ్ కథతో వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. ప్రేక్షకులకు వైవిధ్యమైన కథలతో అలరించే తిరువీర్, మసూద…

Read more

‘‘ఇరువురు భామల కౌగిలిలో’’ ప్రారంభo

దర్శకేంధ్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో అచ్యుత్‌ చౌదరి దర్శకత్వంలో దీపా ఆర్ట్స్‌ శ్రీనివాస గౌడ్‌ నిర్మాతగా ఎంతో అట్టహాసంగా అతిరథ మహారుధుల సమక్షంలో హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైన చిత్రం ‘ ఇరువురు భామల కౌగిలిలో’ . పూజా కార్యక్రమాల అనంతరం దర్శకులు కె.రాఘవేంద్రరావు స్క్రిప్ట్‌ను నటీనటులు, దర్శక, నిర్మాతలకు అందచేశారు. ‘కమిటీ కుర్రాళ్లు’ ఫేమ్‌ త్రినా«ద్‌ వర్మ హీరోగా, వైష్ణవి కొల్లూరు, మలినా హీరోయిన్లుగా అక్షర గౌడ కీలకపాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో ఎంతోమంది ప్రముఖ నటులు నటించనున్నారు. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరో హీరోయిన్లపై నిహారికా కొణిదెల క్లాప్‌నివ్వగా ప్రముఖ దర్శకులు బి.గోపాల్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. ఫస్ట్‌షాట్‌కి ప్రముఖ దర్శకులు ఎ కోదండరామిరెడ్డితో పాటు నిర్మాత, కెమెరామెన్‌ ఎస్‌…

Read more

సీమంతం చిత్రం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్… నవంబర్ 14న థియేటర్స్ లో విడుదల !!!

టీ.ఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న క్రైమ్ థ్రిల్లర్ సీమంతం. హీరోగా వజ్రయోగి, హీరోయిన్‌గా శ్రేయ భర్తీ నటిస్తున్నారు. సుధాకర్ పాణి దర్శకత్వంలో ఈ మూవీ రాబోతొంది. ఈ చిత్రం ప్రశాంత్ టాటా నిర్మాణంలో, గాయత్రి సౌమ్య గుడిసేవ సహనిర్మాతగా తెరకెక్కింది. రచయిత మరియు దర్శకుడిగా సుధాకర్ పాణి వ్యవహరిస్తున్నారు. సంగీతం ఎస్. సుహాస్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందుతోంది. గర్భవతులపై దాడుల నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ టీజర్‌ గ్రిప్ చేసే బీజీఎం, హై టెక్నికల్ వాల్యూస్‌తో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా నవంబర్ 14న న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు…

Read more