Skip to content

నిర్మాతగా నాకు ఎంతో సంతృప్తిని కలిగించిన సినిమా “ది గర్ల్ ఫ్రెండ్” – అల్లు అరవింద్

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 7న హిందీతో పాటు తెలుగులో.. ఈ నెల 14న, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్…

Read more

యువ హీరోలు పూరి ఆకాష్, రోషన్ కనకాల ముఖ్య అథితులుగా ప్రేమిస్తున్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!

వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో మర్రి రవికుమార్ నిర్వాహణలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు. ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులలతో పాటు యువ హీరోలు పూరి ఆకాష్, రోషన్ కనకాల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ... మీడియాకు మరియు ప్రేక్షకులకు నమస్కారం. ఒక సినిమా విడుదల తేది వరుకు వచ్చింది అంటే దాని వెనక ఉన్న కష్టాలు…

Read more

“రాజు వెడ్స్ రాంబాయి” బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది – మంచు మనోజ్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. "రాజు వెడ్స్ రాంబాయి" చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 21న "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా నుంచి 'రాంబాయి నీ మీద నాకు..' లిరికల్ సాంగ్ ను రాకింగ్…

Read more

శివ మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది : నాగార్జున

కింగ్ నాగార్జున ఆల్ టైం కల్ట్ క్లాసిక్ 'శివ' బాక్సాఫీసు రికార్డులుని తిరగరాస్తూ ఇండియన్ సినిమాను 'బిఫోర్ శివ', 'ఆఫ్టర్ శివ'గా రీడిఫైన్ చేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మాతలు అక్కినేని వెంకట్ & సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా శివ చిత్రాన్ని 4K డాల్బీ ఆట్మాస్ లో నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సమక్షంలో శివ రీరిలీజ్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో కింగ్ నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నారు. అద్భతమైన 4K విజువల్స్, డాల్బీ ఆట్మాస్ సౌండ్ తో…

Read more

జటాధరలో మైథలాజికల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి: నిర్మాత ప్రేరణ అరోరా

నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరు‍ణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రేరణ అరోరా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. జటాధర…

Read more

‘శంబాల’ ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. – ఆది సాయికుమార్

వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ ట్రైలర్ ఒక్కసారిగా అంచనాల్ని పెంచేసిన సంగతి తెలిసిందే. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ వంటి వారు నటిస్తున్నారు. రీసెంట్‌గా డార్లింగ్ ప్రభాస్ రిలీజ్ చేసిన ట్రైలర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో చిత్రయూనిట్ మంగళవారం నాడు మీడియా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో.. హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ .. ‘మా టీజర్‌ను రిలీజ్ చేసిన దుల్కర్ గారికి, మాకు సపోర్ట్…

Read more

హైదరాబాద్ కామిక్ కాన్‌లో ‘ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్’ దుమ్మురేపింది

"ఈసారి హైదరాబాద్ కామిక్ కాన్ యాక్షన్ మరియు సై-ఫై కలగలిసిన యుద్ధభూమిగా మారింది! Predator: Badlands తన వేట ప్రపంచాన్ని ఈవెంట్ ఫ్లోర్‌పైకి నేరుగా తీసుకువచ్చి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. హై-డిజైన్ సెట్‌అప్, సినిమాటిక్ లైటింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ — ఇవన్నీ కలిసిపోయి, అభిమానులను ప్రెడేటర్ యొక్క *“Badlands Zone”*లోకి పూర్తిగా ముంచేశాయి. సై-ఫై ప్రేమికులు, గేమర్స్, కలెక్టర్లు, కాస్ప్లే కమ్యూనిటీ — అందరూ ఈ అనుభవం కోసం బారులు తీరారు. అందులో అత్యధిక ఉత్సాహాన్ని తెచ్చింది “Predator Hunter Tech Circuit Challenge”! ఇందులో పాల్గొన్నవారు మెటల్ సర్క్యూట్‌పై కంట్రోల్ వాండ్‌ని నడపాలి — ఒక్క చిన్న పొరపాటు చేసినా వెంటనే రెడ్ అలర్ట్ వస్తుంది. ఈ టాస్క్ గేమింగ్ థ్రిల్,…

Read more

#NC24 నుంచి దక్షగా మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ రిలీజ్

యువ సామ్రాట్ నాగ చైతన్య తండేల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఇప్పుడు నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ #NC24 చేస్తున్నారు. ఈ చిత్రానికి విరూపాక్షతో సంచలన విజయాన్ని అందుకున్న కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మక బ్యానర్లపై BVSN ప్రసాద్, సుకుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె పాత్ర దక్షగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ అదిరిపోయింది. గుహల మధ్యలో పురాతన వస్తువులను పరిశీలిస్తున్న విజువల్ చాలా క్యురియాసిటీ క్రియేట్ చేసింది. ఫీల్డ్ డ్రెస్, గ్లవ్స్, గ్లాసెస్‌తో అంకితభావం,ధైర్యం గల ఆర్కియాలజిస్ట్‌గా…

Read more

“సంతాన ప్రాప్తిరస్తు” ఈ నెల14న రిలీజ్

రామ్ మిరియాల పాడితే ఆ పాట ఛాట్ బస్టర్ కావాల్సిందే. 'చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే..', 'టిల్లు అన్న డీజే పెడితే..', 'ఛమ్కీల అంగీలేసి..', 'ఊరు పల్లెటూరు..', 'టికెట్ ఏ కొనకుండా..', 'సుఫియానా...' ఇలా రామ్ మిరియాల పాటలన్నీ మ్యూజిక్ లవర్స్ కు ఫేవరేట్ సాంగ్స్ అయ్యాయి. ఈ వెర్సటైల్ సింగర్ "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా టైటిల్ సాంగ్ పాడారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేశారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే - 'సంతాన ప్రాప్తిరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు...సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ, ఆల్ ది బెస్టు, నెత్తిన జిలకర బెల్లం పెట్టు, మంగళసూత్రం మెళ్లోన కట్టు, లక్షలు వోసి దావత్ వెట్టు,…

Read more

ఘనంగా ‘తారకేశ్వరి’ ప్రీ-రిలీజ్ వేడుక

తెలుగు ప్రేక్షకుల ముందుకు చాలా రోజుల తర్వాత ఓ సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్ రాబోతోంది. శ్రీ శివ సాయి ఫిలిమ్ బ్యానర్‌పై వెంకట్ రెడ్డి నంది స్వీయ దర్శకత్వంలో, శ్రీకరణ్ – అనూష – షన్ను హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘తారకేశ్వరి’. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో భవ్యంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ, సాహిత్య, సంగీత రంగ ప్రముఖులు పాల్గొని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అన్విక ఆడియో అధినేత సంజీవ్ మేగోటి మాట్లాడుతూ – “గతేడాది నా దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిపర్వం’ మంచి పేరు తెచ్చుకుంది. అమ్మవారి ఆశీర్వాదంతో ‘తారకేశ్వరి’ ఆడియోను మా అన్విక ఆడియో సంస్థ ద్వారా విడుదల చేయడం ఆనందంగా ఉంది. దర్శకుడు…

Read more