నా కెరీర్ లో ఎన్ని సక్సెస్ లు వచ్చినా “K-ర్యాంప్” విజయం ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది – ‘ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్’ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన "K-ర్యాంప్" మూవీ హౌస్ ఫుల్ షోస్ తో పెరుగుతున్న కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయం దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా థర్డ్ వీక్ ప్రదర్శితమవుతూ 40 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి దీపావళి బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది. "K-ర్యాంప్" సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో "K-ర్యాంప్" ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ను…
