Skip to content

కర్మణ్యే వాధికారస్తే మూవీ రివ్యూ & రేటింగ్ !!!

కొన్ని చిత్రాలు పేరుతో సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి. అలాగే ‘కర్మణ్యే వాధికారస్తే’ టైటిల్ తోనే ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై జవ్వాజి సురేంద్ర కుమార్ సమర్పణలో డిఎస్ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా ఈ రోజే థియేటర్స్ లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం.. కథ: విశాఖ పట్నంలో కొంత మంది వ్యక్తులతో అమ్మాయిలు అనుమానాస్పదంగా చనిపోతుంటారు. అయితే ఈ వ్యక్తులకు సంబంధించిన అన్ని చిరునామాలు ఫేక్ అని తెలుస్తాయి. మరోవైపు మన దేశానికి…

Read more

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ‘రన్ ఫర్ యూనిటీ.

భారతదేశ ఉక్కు మనిషి, అఖండ భారత్ నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా ' (జాతీయ ఐక్యతా దినోత్సవం)గా జరుపుకుంటున్న సందర్భంగా, హైదరాబాద్ సిటీ పోలీస్లు ఈరోజు (31.10.2025) ఉదయం 'రన్ ఫర్ యూనిటీ' ని ఘనంగా నిర్వహించారు. ఈ రన్ ముఖ్యంగా పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, హైదరాబాద్‌తో పాటు సిటీ పోలీస్ పరిధిలోని ఏడు జోన్లలో ఘనంగా నిర్వహించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన అద్భుతమైన కృషిని స్ఫూర్తిగా తీసుకుని, దేశ సమైక్యత, సమగ్రత మరియు భద్రతకు కట్టుబడి ఉన్నామని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి చాటి చెప్పడం జరిగింది. ఈ 'రన్ ఫర్ యూనిటీ' లో సుమారు 5000 మంది…

Read more

‘సందిగ్ధం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో నటుడు, నిర్మాత అశోక్ కుమార్

సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో తీర్థ క్రియేషన్స్ బ్యానర్ మీద సంధ్య తిరువీధుల నిర్మాతగా పార్ద సారథి కొమ్మోజు తెరకెక్కించిన చిత్రం ‘సందిగ్ధం’. ఈ చిత్రంలో నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ దేవ్, కాజల్ తివారి, జీవ కోచెర్ల, నవీన్ రాజ్, చిట్టిబాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు, నాగి వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ క్రమంలో ‘సందిగ్ధం’ టీజర్‌ను నటుడు, నిర్మాత అశోక్ కుమార్ శుక్రవారం నాడు రిలీజ్ చేశారు. ‘సందిగ్ధం’ టీజర్ గమనిస్తే.. ఓ ఊరు, అందులో జరిగే వింత ఘటనలు, ప్రేమ కథ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఇందులో చూపించిన విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ ఎంతో సహజంగా కనిపిస్తున్నాయి. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్…

Read more

అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల ’12A రైల్వే కాలనీ’ నుంచి భీమ్స్ సిసిరోలియో, హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యాజిక్ కన్నొదిలి కలనొదిలి సాంగ్ రిలీజ్

అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీ నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర సిరీస్‌ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించడానికి మేకర్స్ ఫస్ట్ సింగిల్ కన్నొదిలి కలనొదిలి విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ట్రాక్ లవ్ ఫీలింగ్ ని అందంగా హైలైట్ చేస్తుంది. భీమ్స్ సాఫ్ట్ కంపోజింగ్ ఇన్స్టంట్ హిట్ అయ్యింది. హేషమ్ అబ్దుల్ వహాబ్ వోకల్స్ ఈ పాట అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది…

Read more

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఈసీ మెంబ‌ర్‌గా బాధ్యతలు స్వీక‌రించిన అశోక్ దయ్యాల

హైద‌రాబాద్: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించింది. నూత‌న కమిటీ సభ్యులతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా అశోక్ దయ్యాల బాధ్య‌తలు స్వీకరించారు. ఈ మేర‌కు అశోక్ దయ్యాలకు రిటర్నింగ్ ఆఫీసర్ నియామక పత్రం అందించారు. ఈ సంద‌ర్భంగా జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ (JCHSL) అధ్యక్షుడు గోపరాజు ఆధ్వర్యంలో నూతన కమిటీని సత్కరించారు. దేవులపల్లి అమర్, సీనియర్ జర్నలిస్టులు కొత్త కమిటీకి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

Read more

రాజేష్ ధ్రువ నటించిన సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ ‘పీటర్’ టీజర్ విడుదల

సస్పెన్స్, థ్రిల్లర్ అనేది ఎప్పుడూ ఎవర్ గ్రీన్‌ జానర్. వృద్ధి స్టూడియోస్ పతాకంపై రవి హిరేమత్, రాకేష్ హెగ్గడే నిర్మాతలుగా సుకేష్ శెట్టి రచించి దర్శకత్వం వహించిన చిత్రం ‘పీటర్’. ఇందులో రాజేష్ ధ్రువ ప్రధాన పాత్రలో నటించగా, జాన్వి రాయల, రవిక్ష శెట్టి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. గురువారం నాడు మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘జెస్సీ మళ్లీ వచ్చింది.. డెవిడ్‌ను ఇక్కడకు తీసుకురా.. చెండే వాయిద్యం అంటే మాకు దైవంతో సమానం.. ఎవరైనా అవమానిస్తే ఊరుకోను’ అంటూ సాగిన టీజర్ ఉత్కంఠను రేకెత్తించేలా సాగింది. ‘పీటర్’ టీజర్‌ను గమనిస్తే కేరళ సంప్రదాయం, కేరళ అందాల్ని అద్భుతంగా చూపించినట్టు కనిపిస్తోంది. టీజర్ కట్ చేసిన విధానం చూస్తుంటే.. సస్పెన్స్,…

Read more

“ది గర్ల్ ఫ్రెండ్” సినిమాలోని హై వోల్టేజ్ డ్రామా ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేస్తుంది – డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా హైలైట్స్ తెలిపారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్…

Read more

సినిమాటికా ఎక్స్ పో 3వ ఎడిషన్ ఈవెంట్ నవంబర్ 1, 2 తేదీల్లో ఘనంగా నిర్విహించబోతున్నాము…

_పి.జి. విందా, మేనేజింగ్ డైరెక్టర్ సినిమా అనేది ఒక కల. ఆ కలను సాకారం చేసేది సాంకేతికత, సృజనాత్మకత, మరియు కొత్త ఆవిష్కరణలు. అదే దిశలో సినిమాటికా ఎక్స్పో 2025 సినిమా భవిష్యత్తుకి వేదికగా ముందుకు సాగుతోంది. హైదరాబాద్‌ హైటెక్ సిటీలోని నవోటెల్ HICCలో నవంబర్ 1–2 తేదీలలో జరిగే ఈ “ సినిమాటికా ఎక్స్పో 2025” ద్వారా ప్రపంచ సినిమా దిశగా మన అడుగులు వేస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైన ఈ ఎక్స్పోను నేను, మరియు 'సినిక క్రియేటర్స్ కౌన్సిల్' స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో, IndiaJoy సహకారంతో నిర్వహిస్తున్నాము. ఈ 3వ ఎడిషన్‌లో ఫుజిఫిల్మ్ వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లు పాల్గొంటున్నాయి. సినిమాటోగ్రఫీ, VFX, వర్చువల్…

Read more