Skip to content

‘తెలుసు కదా’ షూటింగ్ పూర్తి

మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తెలుసు కదా'. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. టీం లోకేషన్ లో కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇటివలే రిలీజ్ చేసిన తెలుసు కదా టీజర్ కు ట్రెంమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సాంగ్ మల్లిక గంధ చార్ట్ బస్టర్ హిట్…

Read more

కిష్కింధపురిలో నా క్యారెక్టర్ కి వచ్చిన రెస్పాన్స్ వెరీ మెమరబుల్: శాండీ మాస్టర్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్ తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన శాండీ మాస్టర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. లియో, లోక ఇప్పుడు కిస్కిందపురి వరుస విజయాలు అందుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది? -చాలా ఆనందంగా ఉంది. ముందుగా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారికి థాంక్స్ చెప్పాలి. ఆయన లియోలో…

Read more

బ్యూటీ’ చూస్తే కంట్లో నీళ్లు వస్తాయి.. – వీకే నరేష్, నటి వాసుకి

అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా ‘బ్యూటీ’ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో నేడు ఈ సినిమాలో కీలక పత్రాలు పోషించిన సీనియర్ నటుడు వీకే…

Read more

మోహ‌న్‌లాల్ వృష‌భ టీజ‌ర్ 18న రిలీజ్

కంప్లీట్ యాక్ట‌ర్ మోహ‌న్‌లాల్ సినిమా అంటే మాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో స్పెష‌ల్‌ క్రేజ్ ఉంటుంది. అన్ని భాష‌ల ఆడియెన్స్ మోహ‌న్‌లాల్‌ సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. ప్ర‌స్తుతం మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియ‌న్ మూవీ వృష‌భ‌లో హీరోగా న‌టిస్తున్నారు మోహ‌న్‌లాల్‌. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీపై అనౌన్స్‌మెంట్ నుంచే ఎక్స్‌పెక్టేష‌న్స్‌ భారీ స్థాయిలో ఏర్ప‌డ్డాయి. మ‌ల‌యాళ సినీ చ‌రిత్ర‌లోనే భారీ బ‌డ్జెట్ సినిమాల్లో ఒక‌టిగా రూపొందుతోన్న వృష‌భ‌ సినిమాకు నంద కిషోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వృష‌భ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మోహ‌న్‌లాల్ గుడ్‌న్యూస్ వినిపించారు. వృష‌భ టీజ‌ర్‌ను సెప్టెంబ‌ర్ 18న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. "యుద్ధాలు, భావోద్వేగాలు, గ‌ర్జ‌న" అంటూ మోహ‌న్‌లాల్…

Read more

ఓజీ’ లో బలమైన కథ, ఫ్యామిలీ డ్రామా ఉంటాయి: ప్రియాంక అరుళ్ మోహన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ఓజీ'. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓజాస్‌ గంభీరగా పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న 'ఓజీ' చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. త్వరలో ట్రైలర్ విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఈ నేపథ్యంలో తాజాగా కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్…

Read more

షణ్ముఖ్‌ జస్వంత్‌ ‘ప్రేమకు నమస్కారం’ టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల

కొత్తదనంతో కూడిన చిత్రాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అందుకే మన దర్శక, నిర్మాతలు ఇప్పుడు న్యూ కాన్సెప్ట్‌ చిత్రాలను నిర్మించడానికి ఇష్టపడుతున్నారు. ఇక ఇప్పుడు సోషల్‌మీడియాలో, యూట్యూబ్‌లో సన్సేషన్‌ సృష్టించిన వారు వెండితెరకు పరిచయమవుతున్నారు. సక్సెస్‌ సాధిస్తున్నారు. ఇటీవల లిటిల్‌హార్ట్స్‌ చిత్రంతో యూట్యూబ్‌ సన్సేషన్‌, మీమ్‌ కంటెంట్‌ క్రియేటర్‌ మౌళి తనూజ్‌ బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాడు. ఇప్పుడు ఈ కోవలోనే యూట్యూబ్‌లో వీడియోలతో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్న యూట్యూబ్‌ సన్సేషన్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఉల్క గుప్తా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు శివాజీ, ప్రముఖ నటి భూమిక కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. ఏబీ సినిమాస్‌ పతాకంపై అనిల్‌ కుమార్‌ రావాడ,…

Read more

అమోజాన్ ప్రైమ్ , ఆహా ఓటీటీలో “కన్యాకుమారి”

గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ హీరో హీరోయిన్లుగా నటించిన "కన్యాకుమారి" మూవీ అమోజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లో ఈ నెల 17వ తేదీ (రేపటి నుంచి) స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సినిమాను మధుశాలినీ సమర్పణలో దర్శకుడు సృజన్ తన రాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే బ్యూటిఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుందీ సినిమా. ఆనంద్ దేవరకొండ హీరోగా పుష్పక విమానం చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సృజన్ "కన్యాకుమారి"తో మరో మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. ఈ చిత్రంలో శ్రీకాకుళం అమ్మాయిగా గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ పర్ ఫార్మెన్స్ లకు మంచి పేరొచ్చింది. గత నెల 27న థియేటర్స్ లోకి…

Read more

ఘనంగా ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌

ఎస్ వి ఎస్ ప్రొడక్షన్స్ శ్రీనిధి సినిమాస్ బ్యానర్స్ పై జాతీయ అవార్డు గ్రహీత నరసింహా నంది రచన దర్శకత్వంలో రానున్న చిత్రం ప్రభుత్వ సారాయి దుకాణం. దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మాతలుగా మురళీమోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీలో నాగిరెడ్డి ఎడిటింగ్ చేస్తూ సిద్ధార్థ్ సంగీతాన్ని అందించారు. సదన్ హాసన్, విక్రమ్ జిత్, నరేష్ రాజు, వినయ్ బాబు హీరోలుగా శ్రీలు దాసరి, అదితి మైకేల్, మోహన సిద్ధి హీరోయిన్లుగా ప్రధాన పాత్రలు పోషించారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, బిజేపి బాలు నాయక్, రంగరాజు, తిలక్, బలగం సహదేవ్, స్వప్న, జ్యోతి తదితరులు కీలకపాత్రల పోషించారు. మల్లిక్, నరేష్ గౌడ్ ఈ చిత్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాటలు…

Read more

పరిపూర్ణ రచయితగా ఎదగాలనేది నా బలమైన కోరిక : ప్రముఖ గీత రచయిత శ్రీమణి

'100 పర్సెంట్‌ లవ్‌' చిత్రంతో తో గీతరచయితగా పరిచయమైన శ్రీమణి. తెలుగు సినీ పరిశ్రమలో పాటల రచయితగా తనకంటూ ఓ గుర్తింపు సంపాందించుకున్నారు. ఎన్నో అగ్రశ్రేణి చిత్రాలకు, స్టార్‌హీరో చిత్రాలకు గేయ రచయితగా పనిచేశారు శ్రీమణి. అనతికాలంలోనే టాప్‌ లిరిక్‌ రైటర్స్‌ల్లో ఒకరిగా పేరుపొందిన ఈ యువ గీత రచయిత పుట్టినరోజు సెప్టెంబరు 15 ( సోమవారం). ఈసందర్భంగా తన కెరీర్‌ విషయాలను మీడియాతో పంచుకున్నారు శ్రీమణి. ఆ విశేషాలివి. ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏమైనా ఉందా? ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. కాకపోతే నా సాహిత్యపు జర్నీలో మరో మెట్టు ఎక్కాలని.. కొత్త అఛీవ్‌మెంట్‌ సాధించాలి అదే నా లక్ష్యం. ఈ రోజే నా లైఫ్ మొదలైంది అనే భావనతో కొత్త…

Read more

మిరాయ్ చాలా సంతోషాన్ని ఇచ్చింది: మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర

సూపర్ హీరో తేజ సజ్జా బ్రహ్మాండం బ్లాక్ బస్టర్ ‘మిరాయ్‌’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్‌ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్రహ్మాండం బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. హనుమాన్, మిరాయ్ రెండు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్స్ అందుకున్నారు.. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? -…

Read more