పేరెంట్స్‌తో అన్ని విషయాల్ని పంచుకునేలా పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలి – సాయి దుర్గ తేజ్
ప్రపంచ వ్యాప్తంగా 70 నగరాలు, వేల మంది యంగ్ ప్రొఫెషనల్స్ కలిసి కాన్పిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)లో భాగంగా యంగ్ ఇండియన్స్ (YI) ఆధ్వర్యంలో పిల్లలపై లైంగిక దాడికి వ్యతిరేక నినాదంతో ‘అభయమ్ మసూమ్ సమ్మిట్’ ఈవెంట్ శనివారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. భారత్ రైజింగ్, యంగ్ ఇండియన్స్, కాన్పిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుప్రిమ్ హీరో శ్రీ సాయి దుర్గ తేజ్, మంత్రి శ్రీ సీతక్క, యంగ్ ఇండియన్స్ కో చైర్మన్ శ్రీ భవిన్ పాండ్య, యంగ్ ఇండియన్స్ నేషనల్ చైర్మన్ శ్రీ తరంగ్ ఖురానా, సీఐఐ తెలంగాణ ఛైర్మన్ శ్రీ శివ ప్రసాద్ రెడ్డి, శ్రీమతి జోత్స్న సింగ్ వంటి వారు…
