‘ఓజీ’ నుండి ‘ఓమి ట్రాన్స్’ విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా 'ఓజీ' చిత్రం నుండి విడుదలైన 'ఓమి' గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా 'ఓజీ' చిత్ర బృందం, 'ఓమి ట్రాన్స్' యొక్క పూర్తి వెర్షన్‌ను విడుదల చేసింది. 'ఓజీ', 'ఓమి'ల ముఖాముఖి పోరుని సూచించేలా ఈ గీతముంది. ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్, ఓమిగా ఇమ్రాన్ హష్మి మధ్య భీకర పోరాటం అద్భుతంగా ఉంటుంది. ఉరుములు, మెరుపులను తలపించే బీట్స్ తో సంగీత సంచలనం తమన్ ఎస్ స్వరపరిచిన 'ఓమి ట్రాన్స్' ఎంతో శక్తివంతంగా ఉండి, నిజంగానే శ్రోతలను ట్రాన్స్ లోకి తీసుకొని వెళ్తుంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కి సంచలనస్పందన రాగా, తాజాగా విడుదలైన ఈ గీతం అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా సినిమాపై…
