‘కిష్కింధపురి’ చాలా ఎంగేజింగ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ : డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ ప్రాజెక్టు ఎలా స్టార్ట్ అయింది? -నా ఫస్ట్ సినిమా చావు కబురు చల్లగా. ఆ సినిమా తర్వాత గీత ఆర్ట్స్ లోనే మరో సినిమా చేయాలి. అయితే కొన్ని కారణాల వల్ల డిలే అయింది. ఒక సందర్భంలో నిర్మాత సాహు గారికి ఈ కథ…
