Skip to content

శ్రీనివాస మంగాపురం తో జై కృష్ణ హీరోగా సక్సెస్ అయ్యాడు: ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

-శ్రీనివాస మంగాపురం సినిమాకు, నా పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు: హీరో జై కృష్ణ ఘట్టమనేని

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని బ్లాక్ బస్టర్ మూవీ ‘శ్రీనివాస మంగాపురం’ తో హీరోగా పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ సమర్పించారు. నిర్మాత పి. కిరణ్ నిర్మించారు. రాషా తడాని హీరోయిన్ గా పరిచయమైయింది. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయం అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ: “అందరికీ నమస్కారం. ప్రేక్షకులకు, అభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమాపై అభిమానులు ఎంతో ప్రేమ, ఆదరణ చూపించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కృష్ణ గారి అభిమానులు దశాబ్దాలుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘మేము కృష్ణ గారి అభిమానులం’ అని చెప్పుకోవడానికి వారు ఎప్పుడూ గర్వపడుతుంటారు. ఈ సినిమాకి కూడా వారు ఎంతో ప్రేమ, ఆదరణ చూపించారు. ఇప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. సినిమా చూసి బయటికి వచ్చిన వారందరూ జై కృష్ణ అద్భుతంగా చేశాడని చెబుతున్నారు. యాక్షన్, పాటలు, డ్యాన్స్‌లు, ముఖ్యంగా డైలాగ్ డెలివరీ అన్నీ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాతో జై కృష్ణ హీరోగా సక్సెస్ అయ్యాడు. తాతగారు, బాబాయిగారు, నాన్నగారి లెగసీని కొనసాగించే వ్యక్తిగా జై కృష్ణ ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే పద్మాలయ లెగసీని కూడా జై కృష్ణ ముందుకు తీసుకెళ్లాలి. తనపై పెద్ద బాధ్యతలు ఉన్నాయి. మా కుటుంబం తరఫున జై కృష్ణను హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. తాతగారు, నాన్నగారి దివ్య ఆశీస్సులు తనపై ఉంటాయి. బాబాయిగారివి, నావి ప్రత్యక్ష ఆశీస్సులు ఉంటాయి. ఈ వేడుకకు విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి, నవీన్ గారికి, అనిల్ సుంకర గారికి, కేఎస్ రామారావు గారికి ధన్యవాదాలు. సినిమాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.”

హీరో జై కృష్ణ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. నా తొలి సినిమా ‘శ్రీనివాస మంగాపురం’కు, నా పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఇస్తున్న ఆదరణకు థ్యాంక్యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది. ఘట్టమనేని అభిమానులందరికీ ధన్యవాదాలు. మొదటి నుంచే నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. మీ నమ్మకాన్ని వంద శాతం మంచి సినిమాలతో నిలబెడతాను. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. బంగారు తాతయ్యకు థ్యాంక్యూ. ఆయన ఎప్పుడూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తారు. దత్ గారికి, కిరణ్ గారికి, అజయ్ గారికి ధన్యవాదాలు. ఇది నా తొలి సినిమా. నా కెరీర్‌లో ఎప్పటికీ స్పెషల్‌గా ఉంటుంది. ఈ సినిమా చేయడం చాలా ఎంజాయ్ చేశాను. నవీన్ గారికి, అనిల్ గారికి భరద్వాజ గారికి, రామారావు గారికి ధన్యవాదాలు. ఈ వీకెండ్ ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా చూడండి. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మహేష్ బాబు గారు సినిమా చూసి నేను చాలా బాగా పెర్ఫార్మ్ చేశానని చెప్పడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ: ఈ సినిమా నేను చూశాను. చాలా అద్భుతంగా ఉంది. జై కృష్ణ ఎక్స్‌ట్రా ఆర్డినరీగా పెర్ఫార్మ్ చేశాడు. దత్తు గారు పెద్ద సినిమాలను ఎంత గ్రాండ్‌గా నిర్మిస్తారో, ఈ సినిమాను కూడా అదే స్థాయిలో తీశారు. ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. జై కృష్ణ ఎంతో అనుభవం ఉన్న నటుడిలా పెర్ఫార్మ్ చేశాడు. భారీ సినిమాలకు ఉండే గ్రాండియర్ ఈ సినిమాలో కూడా కనిపించింది. సినిమా చూస్తున్నప్పుడు చాలా ఎమోషనల్‌గా అనిపించింది. జై కృష్ణకు ఆల్ ది వెరీ బెస్ట్.”

నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ: జై కృష్ణకు కంగ్రాచ్యులేషన్స్. మేము కృష్ణ గారి అభిమానులం. మా బ్యానర్‌లో తొలి సినిమా మహేష్ బాబు గారు చేశారు. ఈ సినిమాను నేను ఫస్ట్ డే, ఫస్ట్ షో చూశాను. జై కృష్ణ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. ఎంతో అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. తప్పకుండా మా బ్యానర్‌లో కూడా ఆయనతో ఒక సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఒక హీరోను పరిచయం చేయాలంటే అశ్విని దత్ గారు పర్ఫెక్ట్. ప్రేక్షకులు అందరూ ఈ సినిమాను థియేటర్‌కు వచ్చి చూడాలని కోరుకుంటున్నాను.

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ: మాకు జై కృష్ణ రూపంలో మరో హీరో దొరికాడు. అభిమానులు కూడా ఆయనకు థ్యాంక్స్ చెబుతారు, అంత బాగా చేశాడు. పాటలు, ఫైట్స్, పెర్ఫార్మెన్స్… ప్రతి విషయంలో తన ప్రతిభను చక్కగా చూపించాడు. తన ప్రతి సినిమా మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. కృష్ణ గారి అభిమానులు అంటే మాకు ఎంతో గర్వం. ఆ గర్వాన్ని జై కృష్ణ కూడా నిలబెట్టాలని కోరుకుంటున్నాను. కృష్ణ గారిలా వేగంగా సినిమాలు చేస్తూ ముందుకు సాగాలి. ఇది అంతం కాదు… ఆరంభమే.”

నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ: కృష్ణ గారితో కలిసి సినిమాలు నిర్మించాను. రెండు సినిమాలకు దర్శకత్వం కూడా వహించాను. చివరి నిమిషం వరకు ఆయనతోనే ఉన్నాను. కృష్ణ గారిని అభిమానులు ఎంతగానో అభిమానించారు. ఆయన తర్వాత మహేష్ బాబును కూడా అదే ప్రేమతో ఆదరిస్తున్నారు. ఇప్పుడు జై కృష్ణ సినిమా విడుదలకు కూడా అదే అభిమానాన్ని చూపించారు. అభిమానులు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తోంది. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.